Flora Asodia : అహ్మదాబాద్‌ కలెక్టర్ గా 11 ఏళ్ల బాలిక

గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లా కలెక్టర్ గా 11 ఏళ్ల బాలిక నియమితురాలు అయ్యింది.7వ తరగతి చదివే ఫ్లోరా అనే బాలిక జిల్లా కలెక్టర్ అయ్యింది.

Gujarat Girl Flora Asodia  One Day Collector : కలెక్టర్ కావాలంటే ఎంతో కష్టపడి చదవాలి. కానీ ఓ బాలిక మాత్రం 11 ఏళ్లకే కలెక్టర్ అయ్యింది.దీనికి కారణం వింటే చాలా బాధ కలుగుతుంది. బాగా చదువుకుని కలెక్టర్ కావాలని కలలు కన్న ఆ చిన్నారికి ప్రాణాంతక వ్యాధి బారిని పడింది.దీంతో నేను కలెక్టర్ కాకుండానే చనిపోతాననే దిగులుపడిపోయిందా చిన్నారు. కానీ ఆబాలిక కోరిన నెరవేర్చారు అధికారులు. ఒక్కరోజు కలెక్టర్ గా నియమించారు. దీంతో కలెక్టర్ కావాలనే కోరిక ఈ రకంగా నెరవేరినందుకు ఆ చిట్టితల్లి ఎంతో మురిసిపోయింది గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఫ్లోరా అసోడియా 7th class చదువుతున్న ఫ్లోరా అసోడియా అనే బాలిక.

Read more : ఫిన్లాండ్ ప్రధానిగా 16 ఏళ్ల బాలిక..

ఫ్లోరా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. గత ఆగస్టులో ఫ్లోరాకు బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలో ఆమెకు ఇక ఫరవాలేదు కోలుకుంటుంది కదాని ఆనందపడ్డారు తల్లిదండ్రులు. కానీ ఫ్లోరా ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. కానీ కలెక్టర్ కావాలనే తమ కూతురు కోరిక నెరవేర్చలేకపోతున్నామని తల్లిదండ్రులు బాధపడ్డారు. ఈ క్రమంలో ఫ్లోరా కలను తెలుసుకున్నారు మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు. చొరవ తీసుకుని చిన్నారి గురించి అహ్మదాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సందీప్ సాంగ్లేకు పరిస్థితి గురించి తెలిపాలి. దీంతో చిన్నారిని ఒక్కరోజు కలెక్టర్‌ చేసేందుకు అంగీకరించారు కలెక్టర్.

Read more : ఒక్కరోజు కలెక్టర్ గా 16 ఏళ్ల బాలిక

చిన్నారి ఫ్లోరా కోరిక గురించి తెలిసిన మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిథులు చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి..ఒకరోజు కలెక్టర్‌ గురించి అడిగారు. కానీ..ఆపరేషన్ తరువాత ఫ్లోరా పరిస్థితి ఏమీ బాగాలేదు అని ఇటువంటి సమయంలో రెస్ట్ చాలా అవసరమని విముఖత వ్యక్తం చేశారు ఫ్లోరా తల్లిదండ్రులు. కానీ చిన్నారి కోరికను నెరవేర్చటం మన ధర్మం అని చెప్పి..చివరకు ఎలాగోలా వారిని ఒప్పించి ఫ్లోరా కలను సాకారం చేశారు మేఖ్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతనిధులు.

చిన్నారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబరు 25న ఫ్లోరా పుట్టిన రోజును ముందే జరిపారు. ఫ్లోరా చదువులో ముందుండేదని చెప్పారు ఆమె తల్లిదండ్రులు. కలెక్టర్‌ అవ్వాలనుకున్న తన కలను నెరవేర్చినందుకు సంతోషిస్తూ.. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఫ్లోరా అసోడియా తల్లిదండ్రులు.

ట్రెండింగ్ వార్తలు