Weather Report: తెలంగాణలో పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం

ఆది, సోమ, మంగళ వారాల్లో తెలంగాణలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

Weather Report: తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు వాతావరణశాఖ వర్ష సూచన చేసింది. ఆది, సోమ, మంగళ వారాల్లో తెలంగాణలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న చల్లటి గాలుల కారణంగా వాతావరణంలో అస్థిరత నెలకొంది. దక్షిణ, ఆగ్నేయ భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. ఈప్రభావంతో తెలంగాణలో ఉష్ణోగ్రత పెరిగి, చలి తీవ్రత తగ్గనుంది. వాతావరణంలో తేమతో చలి, పొడి గాలులు కలయిక కారణంగా గాలిలో మంచు పొరలు ఏర్పడి వడగళ్ల వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, సహా ఇతర ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.

Also read: Heavy Rains : ఉత్తరాదికి వర్ష ముప్పు.. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వానలు

మరోవైపు ఉత్తర భారతంలో హిమపాతం కొనసాగుతుంది. ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్, కేదార్ నాథ్, హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లా, కులుమనాలి, కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో భారీగా మంచు తుఫాను కురుస్తుంది. మరో రెండు రోజుల పాటు హిమపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

Also read: India-America: అమెరికాకు మన మామిడి, దానిమ్మ, అక్కడి నుంచి మనకు గడ్డి దిగుమతి

ట్రెండింగ్ వార్తలు