Police with arrested accuseds
Fake Notes: కష్టపడకుండా కోట్లకు పడగలెత్తాలన్న దురాశతో ఈజీ మనీకి అలవాటుపడి కొందరు అనేక అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. దొంగతనాలు చేస్తూ కొందరు.. దొంగనోట్లతో మోసాలకు పాల్పడుతూ కొందరు ఇలా పలు విధాలుగా తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది పోలీసులకు పట్టుబడుతున్నారు. తాజాగా.. ఈ తరహా ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈజీ మనీకోసం నకిలీ నోట్లు చలామణి చేయాలని ప్లాన్ చేసిన వ్యక్తిని, అత్యాశకుపోయి నిందితుడితో చేతులు కలిపిన మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ఇదేందిది..! భర్తలు తాగుబోతోళ్లని.. ఇద్దరు భార్యలు ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజరకు చెందిన మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం చేసేవాడు. అతడు కష్టపడకుండా లక్షలు సంపాదించాలన్న దురాశతో తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈజీ మనీ కోసం నకిలీ నోట్లు చలామణి చేయాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా తనకు డబ్బుల డంప్ దొరికిందని, ఆ డబ్బంతా నేనొక్కడినే తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.. అందుకే రూ.లక్ష ఇచ్చిన వారికి రూ.2లక్షల ఒరిజినల్ నోట్లు ఇస్తా.. నకిలీ నోట్లు కావాలంటే లక్ష ఒరిజినల్ నోట్లు ఇస్తే నాలుగు లక్షలు నకిలీ నోట్లు ఇస్తానని పలువురిని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వారిని అడవిలో డబ్బుల డంప్ వద్దకు తీసుకెళ్లి చూపించాడు.
Also Read: మీర్‌పేట్ మాధవి కేసులో మాజీ జవాన్‌ను పట్టించిన గ్యాస్‌స్టవ్
కృష్ణ మాయమాటలను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్ నమ్మాడు. శ్రీనివాస్ ను డబ్బుల డంప్ వద్దకు తీసుకెళ్లి చూపించాడు. నిజమేనని నమ్మిన శ్రీనివాస్.. 10లక్షల ఒరిజినల్ నోట్లకు రూ.20లక్షల అసలు నోట్లు, మరో రూ.5లక్షల ఒరిజనల్ నోట్లకు రూ.20లక్షల నకిలీ నోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. దీంతో కృష్ణ మరో నలుగురితో కలిసి నకిలీ నోట్లు తీసుకొని శుక్రవారం కారులో హనుమకొండ ఔటర్ రింగ్ రోడ్డులోని పెగడపల్లి క్రాస్ రోడ్డు వద్దకు వచ్చాడు. శ్రీనివాస్ కూడా మరో ఇద్దరితో కలిసి అక్కడికి చేరుకున్నాడు.
Also Read: Indian Army : ఎదురులేని భారత్.. యుద్ధం ఏది వచ్చినా.. ఎలాంటిది వచ్చినా..
ఇదే సమయంలో అటువైపు పెట్రోలింగ్ కు వచ్చిన పోలీసులు వారిని గనించారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. కారును తనిఖీ చేయగా సుమారు 34లక్షల ఒరిజనల్ నోట్లు, రూ. 21లక్షల నకిలీ నోట్లు, వాటి తయారీకి వాడే తెల్ల కాగితాలను పోలీసులు గుర్తించారు. దీంతో వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారి వద్ద నుంచి కరెన్సీ నోట్లతోపాటు ఆటో, తొమ్మిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.