ఇదేందిది..! భర్తలు తాగుబోతోళ్లని.. ఇద్దరు భార్యలు ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు..
ఆ ఇద్దరు మహిళలను ఇన్‌స్టాగ్రామ్ కలిపింది. ప్రతిరోజు చాటింగ్ చేసుకునేవారు.

ఆ ఇద్దరు మహిళల పేర్లు కవిత, గుంజా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం స్నేహంగా.. స్నేహం ప్రేమగా మారి తమ భర్తలను వదిలేసి ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నారు. ఓ ఆలయానికి వెళ్లి దేవుడి విగ్రహం సాక్షిగా కవిత నుదుటిపై గుంజా తిలకం దిద్దింది.
మెడలో కల్యాణ మాలలు వేసుకుని, ఏడడుగులు నడిచారు. ఎవరూ ఊహించని ఈ చిత్ర విచిత్రం ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో చోటుచేసుకుంది. మహిళను మరో మహిళ పెళ్లి చేసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఆ ఇద్దరు మహిళల భర్తలు తాగుబోతులు. ప్రతిరోజు తాగి వచ్చి వారిని విసిగించేవారు.
భర్త పెట్టే చిత్రహింసలను భరించలేకపోతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో కవితకు గుంజా తెలిపింది. తాను కూడా ఇలాగే భర్త చేతిలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని గుంజాకు కవిత చెప్పింది. ఇలా వారు ప్రతిరోజు ఇన్‌స్టాలో చాటింగ్ చేసుకునేవారు. చివరకు కవిత, గుంజా పెళ్లి చేసుకుందామని నిర్ణయం తీసుకుని దియోరియాలోని శివాలయంలో వివాహమాడారు.
అనంతరం గుంజా మీడియాతో మాట్లాడుతూ.. తమ భర్తలకు తాగుడు అలవాటు ఉందని చెప్పారు. వారి తీరుతో తామిద్దరం హింసకు గురయ్యామని తెలిపారు. అందుకే తాను, కవిత ప్రశాంతతో జీవించడానికి పెళ్లి చేసుకున్నామని చెప్పారు. తాము గోరఖ్‌పుర్‌లో సంసారాన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. కాగా, మన దేశంలో స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు చట్టబద్ధత లేదు. అయినప్పటికీ, చాలా జంటలు పెళ్లిళ్లు చేసుకుంటున్నాయి.
Bandi Sanjay: ఈ పేరు పెడితే కేంద్ర సర్కారు ఒక్క ఇల్లు కూడా ఇవ్వదు: బండి సంజయ్