మీర్‌పేట్ మాధవి కేసులో మాజీ జవాన్‌ను పట్టించిన గ్యాస్‌స్టవ్‌

మీర్‌పేట్ హత్యకేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.

మీర్‌పేట్ మాధవి కేసులో మాజీ జవాన్‌ను పట్టించిన గ్యాస్‌స్టవ్‌

Hyderabad Ex Jawan Gurumurthy Case

Updated On : January 25, 2025 / 11:24 AM IST

మీర్‌పేట్ హత్యకేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాజీ జవాన్ గురుమూర్తి తన భార్య వెంకటమాధవిని హత్యచేసి ఆధారాలు దొరకకుండా చేసేందుకు అతిక్రూరంగా ప్రవర్తించాడు. భార్య శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడికించాడు. అయితే, ఈ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ఈ కేసులో ఆధారాలను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. పోలీసుల విచారణలో తానే హత్యచేసినట్లు భర్త గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ.. చనిపోయింది మాధవినే అని నిర్దారించేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ద్వారా ఎట్టకేలకు ఆధారాలను సేకరించారు. ఆ ఆధారాల ప్రకారం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.

Also Read: అమ్మ ఎక్కడ నాన్న అని పిల్లలు అడిగితే.. గురుమూర్తి సమాధానం ఇదే..

గురుమూర్తి తన భార్య వెంకటమాధవిని హత్య చేసిన అనంతరం డెడ్ బాడీని బాత్ రూమ్ లోకి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాత్ రూమ్ లోనే ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి 25 లీటర్ల సామర్థ్యం కలిగిన పెయింట్ బకెట్ లో వేసినట్లు, మాంసం ముద్దలు కరిగిపోయేందుకు పొటాషియం హైడ్రెడ్, వాటర్ హీటర్ ను వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తరువాత కరిగిపోయిన శరీర భాగాల నుండి ఎముకలను వేరుచేసి బాత్ రూమ్ నుండే కరిగిపోయిన మాంసం ముద్దలను డ్రైనేజీలోకి పంపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎముకలను కమర్షియల్ గ్యాస్ స్టవ్ పై బాగా కాల్చి.. వాటిని రోటిలో పొడిగా చేసి ఆ పొడినిసైతం బాత్ రూమ్ నుంచే డ్రైనేజీలోకి పంపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, కేసు విచారణకు నిందితుడు గురుమూర్తి సహకరించడం లేదని తెలుస్తోంది. దీంతో పోలీసులు టెక్నికల్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఆధారంగా కేసును ఛేదించే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వెళ్లొచ్చాం.. తాళి తీసి నా ముఖంపై విసిరేసింది.. భార్యను ముక్కలుచేసిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

భర్య హత్య కేసులో ఎలాంటి ఆధారాలు దొరకకుండా నిందితుడు గురుమూర్తి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ క్రమంలో కేసు విచారణలో భాగంగా ఆధారాలు దొరకక తొలి రెండు రోజులుగా తలలు పట్టుకున్న పోలీసులకు.. ఈ కేసును ఛేధించేందుకు శుక్రవారం కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఆధారాలను గుర్తించేందుకు పోలీసులు లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించారు. ఈ క్రమంలో కిచెన్ లో గ్యాస్ స్టవ్ పై రక్తపు మరకలు, రక్తం తుడిచినట్టున్న టిష్యూ పేపర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రెండింటినీ క్లూస్ టీమ్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించింది. అదే సమయంలో ఆమె పిల్లల నుంచి శాంపిల్ తీసుకొని డీఎన్ఏ టెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ రెండు ఆధారాలతో పోలీసులు దర్యాప్తులో ముందుకెళ్తున్నారు.

 

పండుగ రోజు సినిమాకు వెళ్లొచ్చిన తరువాత భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య మాధవిని గోడకేసి కొట్టడంతో ఆమె మరణించింది. ఆ తరువాత ఆమె మృతదేహం వద్దనే గురుమూర్తి సుమారు ఐదారు గంటలు కూర్చున్నట్లు తెలిసింది. ఆ సమయంలో ఆనవాళ్లు ఎవరూ గుర్తించకుండా మృతదేహాన్ని ఎలా మాయం చేయాలి అనే విషయాలను తెలుసుకునేందుకు యూట్యూబ్ లో వెతికాడట. ఈ క్రమంలో ఓ వెబ్ సిరీస్ లోని దృశ్యాలను ప్రేరణగా తీసుకొని మృతదేహాన్ని ముక్కముక్కలుగా చేసి.. ఎముకలను వేరుచేసి పోలీసులకు ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడినట్లు తెలిస్తుంది. అయితే, ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.