Harish Rao
Harish Rao: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అతిపెద్ద పవర్ స్కామ్‌కు తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
“విద్యుత్ కుంభకోణానికి నిన్నటి క్యాబినెట్‌లో ఆమోదముద్ర వేసుకున్నారు. రామగుండం, పాల్వంచ, మక్తల్ పవర ప్లాంట్లలో అక్షరాలా రూ.50 వేల కోట్ల స్కామ్ జరుగుతోంది. సకల కుంభకోణాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్‌గా మారింది. (Harish Rao)
వాటాల కోసమే క్యాబినెట్ మీటింగులు జరగటం సిగ్గుచేటు. మెన్నటి క్యాబినెట్ మీటింగ్ ల్యాండ్ స్కామ్.. నిన్నటి క్యాబినెట్ మీటింగ్ పవర్ స్కాం కోసమే జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసినా ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషనే కమిషన్.
తమకు తాము ఎలా మేలు చేసుకోవాలన్నదే రేవంత్ రెడ్డి ఆలోచన. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే.. అరాచకం రాజ్యమేలుతోందని కేసీఆర్ గతంలోనే చెప్పారు. వాటాల విషయంలో వచ్చిన తేడాలతో మంత్రులు రోడ్డెక్కారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే డర్టీ పాలిటిక్స్‌కు తెర తీస్తున్నారు. మంత్రివర్గం స్కామ్‌ల గురించి తప్ప.. స్కీమ్‌ల గురించి మాట్లాడం లేదు.
Also Read: హత్యకు గురైన ఇమ్రాన్ ఖాన్? జైలు వద్ద ఉద్రిక్తత.. ఏం జరుగుతోంది?
ఎన్టీపీసీ ధర ఎంతనో, జెన్ కో ధర ఎంతనో ప్రభుత్వానికి తెలుసు. అంత తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాకు తెర తీశారు. రేవంత్ అపరిచితుడు, చంద్రముఖి లెక్క కూడా మారిపోతారు. కమిషన్ల కోసమే.. డబల్ కాస్ట్ తో 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్స్. పథకాల అమలుకు డబ్బులు లేవంటూనే.. వేల కోట్లతో పవర్ ప్లాంట్లు ఎలా నిర్మిస్తారు?
తక్కువ ధరకు పవర్ ఇస్తామని ఎన్టీపీసీ లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించదు? కేంద్రంలోని బీజేపీ డైరెక్షన్‌లోనే రేవంత్ ప్రభుత్వం యాక్షన్ ఉంటుంది. ఉన్న డిస్కంలను ప్రైవేట్ పరం చేసేందుకు.. కొత్త డిస్కంలను తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ స్కామ్‌లపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాం” అని అన్నారు.