Minister Komatireddy : కేసీఆర్ ముక్కు నేలకురాసి నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి

ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్పమని ముందుకొచ్చి అసెంబ్లీలో తీర్మానాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టడం అంటే.. ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ విజయం అని హరీష్ రావు అన్నారు.

Telangana Assembly : ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజెప్పమని ముందుకొచ్చి అసెంబ్లీలో తీర్మానాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టడం అంటే.. ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ విజయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రేపు నల్గొండలో సభలో పెట్టాం కనుక.. ముందే రోజు సభలో తీర్మానం పెట్టి వాళ్లు చేసిన తప్పులను సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. ఘాటుగా రిప్లై ఇచ్చారు. నల్లగొండను మోసం చేసినందుకు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ నేతలను చెప్పుతో కొట్టారు. అందుకే నల్గొండ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని కోమటిరెడ్డి అన్నారు. జగదీష్ రెడ్డి, కేసీఆర్, హరీష్ రావులు కలిసి నల్గొండ ఉమ్మడి జిల్లాకు, దక్షిణ తెలంగాణ మొత్తానికి అన్యాయం చేశారు. ఇవాళ సభలో ప్రాజెక్టులపై చర్చ అనేసరికి జగదీశ్వర్ రెడ్డి సభకురాలేక మొఖం చాటేసిండని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.. లేకపోతే నల్గొండలో కాలు పెట్టే అర్హత లేదంటూ కోమటిరెడ్డి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి స్టేట్ మెంట్ చూసిన తరువాత మీ తలకాయ్ ఎక్కడ పెట్టుకుంటారు అంటూ బీఆర్ఎస్ నేతలను కోమటిరెడ్డి ప్రశ్నించారు.

Also Read : Minister Uttam Kumar Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకంవల్లే కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం.. అసెంబ్లీలో ఉత్తమ్

హరీష్ రావు మాట్లాడుతూ.. చెప్పుతో కొడుతా అనే మాటలను సభ రికార్డ్ ల నుంచి తొలగించాలని పట్టుబట్టారు. దీంతో ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటల్లో సారాంశం ఒక్కటే.. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులను అప్పగించలేదు.. మీరు రాగానే ప్రాజెక్టులను అప్పగిస్తున్నట్లు సంతరం పెట్టి వచ్చారు.. కాంగ్రెసోళ్లు ఎంత లొల్లిపెట్టినా, ఎంత అరిచినా ఇది దాగని సత్యం అని, ఆధారాలతో సహా సభ ముందు ఉంచుతామని హరీష్ రావు అన్నారు.

Also Read : ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేసుకుంటున్న బీజేపీ

 

 

ట్రెండింగ్ వార్తలు