Minister Uttam Kumar Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకంవల్లే కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం.. అసెంబ్లీలో ఉత్తమ్

గత ప్రభుత్వం నిర్వాకంవల్ల కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందనే యూపీఏ ప్రభుత్వం.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ఉత్తమ్ అన్నారు.

Minister Uttam Kumar Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకంవల్లే కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం.. అసెంబ్లీలో ఉత్తమ్

Minister Uttam Kumar Reddy

Telangana Assembly Budget Session 2024 : తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. అంతకుముందు కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు పేరుతో నోట్ విడుదల చేసింది. అనంతరం సభలో తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇచ్చారు. తెలంగాణ రైతులకు కొన్ని అపోహలు కొందరు కల్పించారు.. అందరి అనుమానాలు నివృత్తి చేసేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నామని అన్నారు.

Also Read : Telangana Assembly Budget Session 2024 : 2లక్షల75వేల 891 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఆరు గ్యారంటీల అమలుకు కేటాయింపులు ఎన్నంటే?

గత ప్రభుత్వం నిర్వాకంవల్ల కృష్ణా నీటి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నీటి పంపకాల్లో అన్యాయం జరిగిందనే యూపీఏ ప్రభుత్వం.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ఉత్తమ్ అన్నారు. కానీ, గత పదేళ్లలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ అన్యాయం చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. Go 203 ద్వారా ఏపీ రాయలసీమ ప్రాజెక్టు చేపట్టారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సైలెంట్ గా ఉంది.
రాయలసీమ ప్రాజెక్టు వల్ల.. శ్రీశైలం పై ఆధారపడిన తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నర్దాకనంగా మారాయని ఉత్తమ్ అన్నారు. 2014 తర్వాత.. 1200 టీఎంసీల నీరు బయట బేసిన్ లకు తరలించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక నీటి తరలింపు పెరిగిందన్నారు.

Also Read : CM Revanth Reddy : ఆర్టీసీ బస్సులో సీఎం రేవంత్‌రెడ్డి ప్రయాణం.. కొత్త‌గా 100 బ‌స్సులు..

నదీ జలాల పంపకాలు.. పరివాహక ప్రాంతం, జనాభా, సాగును దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కానీ, కృష్ణా నీటి పంపకాల్లో దీనికి విరుద్ధంగా జరిగిందని ఉత్తమ్ అన్నారు. కృష్ణాలో తెలంగాణ పరివాహక ప్రాంతం 68శాతం ఉంటే.. కేటాయింపులు 33శాతంకు గత ప్రభుత్వం ఒప్పుకుంది. నిర్మాణంలోఉన్న ప్రాజెక్టుల కేటాయింపులను కేంద్రం వద్ద సాధించలేక పోయారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 225 టీఎంసీలు అవసరం అయితే.. వాటిని ప్రస్తావించలేదు. పాలమూరు – రంగారెడ్డికి వేల కోట్లు ఖర్చుచేసి ఒక్క ఎకరాకు సాగు నీరు ఇవ్వలేదని ఉత్తమ్ గత ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. కృష్ణా లో 731 టీఎంసీలు అడిగే హక్కు ఉన్నా.. 299 టీఎంసీలకు ఒప్పుకున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా తాకట్టు పెట్టారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం.. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నికర జలాలు కేటాయింపులు జరిగాయి. తెలంగాణ క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉన్నా.. గత ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిబ్యునల్ -2 ప్రకారం.. ట్రమ్ అండ్ రిఫరెన్స్ గత ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోక.. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీశారు. నిర్మాణం పూర్తి చేసిన, నిర్మాణం ఉన్న, నిర్మించబోయే వాటిని కేంద్రానికి వివరించి నీటి హక్కులు సాధించడంలో గత ప్రభుత్వం విఫలం అయిందని ఉత్తమ్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన మొదటి సంవత్సరం నుంచే రాష్ట్రానికి అన్యాయం చేశారు. కృష్ణా జలల్లో 9.5 ఏళ్ల పాటు అన్యాయం చేసి.. 33శాతం నీటికి ఒప్పుకొని లాస్ట్ ఇయర్ నుంచి 50శాతం కావాలని అడుగుతున్నారు.