Telangana Assembly Budget Session 2024 : 2లక్షల75వేల 891 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఆరు గ్యారంటీల అమలుకు కేటాయింపులు ఎన్నంటే?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ...

Telangana Assembly Session 2024
Telangana Assembly 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2 లక్షల75వేల 891 కోట్ల రూపాయలతో తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో ఆరు గ్యారంటిల అమలుకు 53 వేల 196 కోట్ల రూపాయల కేటాయింపులు చేసినట్లు చెప్పారు.
- 2022 -23కు ఖర్చు 2లక్షల4వేల523 కోట్లు.
- 2022 – 23 రెవెన్యూ మిగులు 5,944 కోట్లు.
- 2022 -23 ద్రవ్యలోటు 32,557 కోట్లు.
- ప్రస్తుత బడ్జెట్లో శాఖల వారిగా కేటాయింపులు ఇలా..
- ఐటీ శాఖకు 774 కోట్ల రూపాయలు
- పంచాయితీ రాజ్ శాఖకు 40,080 కోట్లు
- పురపాలక శాఖకు 11 వేల 692 కోట్ల రూపాయలు
- వ్యవసాయానికి 19 వేల 746 కోట్ల రూపాయలు
- వైద్య, ఆరోగ్య రంగానికి 11 వేల 5 వందల కోట్ల రూపాయలు
- విద్యా రంగానికి 21 వేల 389 కోట్ల రూపాయలు
- తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తాం
- ఉన్నత విద్య, మౌలిక సదుపాయాలకు రూ. 500కోట్లు
- ప్రతి మండలానికి ఒక అధునాతన సౌకర్యాలతో.. ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం
- తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు.
- యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లు
- విద్యుత్ సంస్థలకు 16,825 కోట్లు.
- విద్యుత్ – గృహ జ్యోతికి 2418కోట్లు.
- 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తాం.
- నీటి పారుదల శాఖ కు 2,8024 కోట్లు
- గృహ నిర్మాణానికి 7,740 కోట్లు.
- ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు.
- రైతుబంధు పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
- రైతు బంధు నిధులు రియల్టర్లు, పెద్దవాళ్ళకు లాభం చేస్తుంది.
- రైతు బంధు నిబంధనలను పున:సమీక్షిస్తాం
- ప్రతీ రైతుకు రైతు భరోసా ఇస్తాం
- ధరణి కొందరికి భరణంగా, మరి కొందరికి ఆభరణంగా మారింది
- లోపభూయిష్టంగా ధరణి ఉంది
- ధరణిని మార్చేందుకు నిపుణుల కమిటీ పనిచేస్తుంది
- సమ్మక్క సారలమ్మ జాతరకు 110 కోట్ల రూపాయల కేటాయింపు
- మూసీ సుందరీకరణ, అభివృద్ధికి 1000కోట్ల బడ్జెట్.
- మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై సర్కార్ స్పెషల్ ఫోకస్.
- లండన్ థెమ్స్ నదిలా మూసీ నది అభివృద్ధికి కృషి.
- పాదచారుల జోన్లు, చిల్డ్రన్స్ థీమ్స్ పార్కులు, ఎంటర్ టైన్ మెంట్ జోన్లు,
- పర్యావరణ పద్దతిలో మూసీ డెవలప్మెంట్ కు చర్యలు
- రీజినల్ రింగ్ రోడ్డు పనులు యుద్ద ప్రాతిపాదికన పూర్తి చేయాలన్నదే సర్కార్ లక్ష్యం
- TSPSC నిర్వహణకోసం 40 కోట్ల రూపాయలు
- జాబ్ క్యాలెడర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ.
- త్వరలోనే మెగా డీఎస్సీ , జ్యాబ్ కేలండర్ విడుదల చేస్తాం
- త్వరలో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేసి, నియామక పత్రాలు ఇస్తాం
- గ్రూప్ -1 లో 64 ఉద్యోగాలను చేర్చి భర్తీ చేయబోతున్నాం
- గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ గ్రూప్ -1 ఉద్యోగాలను ఇవ్వలేదు.
- యువకులను రెచ్చగొ ట్టుడు కాదు.. అక్కునచేర్చు కుంటాం
- గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడింది
- Tspsc తో తెలంగాణ యువత ఆకాంక్షలను నెరవేరుస్తాం
- సంక్షేమ రంగానికి కేటాయింపులు
- ఎస్సీ సంక్షేమానికి 21 వేల 874 కోట్లు
- ఎస్టీ సంక్షేమానికి 13 వేల 313 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి 2 వేల 262 కోట్లు
- బిసి సంక్షేమానికి 8 వేల కోట్లు
- బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు.
- ఎస్సీ గురుకుల భవనాల నిర్మాణానికి రూ. 1000 కోట్లు.
- ఎస్టీ గురుకుల భవనాల నిర్మాణానికి రూ. 250కోట్లు.
- ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలలను మరింత అభివృద్ధి చేస్తాం.
- గురుకులాలకు అన్ని వసతులతో కూడిన నూతన భవనాలను నిర్మిస్తాం.
- గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కళాశాలల ఏర్పాటు చేయబోతున్నాం.
- నాణ్యమైన విద్య అందించాలన్నదే మా ధ్యేయం.
- బీసీ గురుకుల నూతన భవనాలకు రూ. 1546 కోట్లు.
- మనకు తెలిసిందే వేదం అన్నట్లు .. సాగునీటి రంగం పై గత ప్రభుత్వం వ్యవహరించింది
- కాంట్రాక్టర్ లకొసమే సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేసింది గత ప్రభుత్వం.
- నాటి ప్రభుత్వం ఒంటెద్దు పోకడ.. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది
- లక్షల కోట్ల అవినీతిలో ఎంతో తేల్చాల్సి న భాధ్యత మాపై పడింది.