Huzurabad : బొట్టుబిళ్ల vs ఆసరా ఫింఛన్ – హరీష్ రావు

హుజూరాబాద్ లో బొట్టుబిళ్లకు, ఆసరా ఫింఛన్ కు మధ్య పోటీ అని ఆర్ధికమంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

Harish Rao Interaction With Retired Govt Employees

Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది.. మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్ లో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు హుజూరాబాద్ లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏడేళ్ల వ్యవధిలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గురించి వివరించారు.

రాష్ట్రం వచ్చిన తొమ్మిది నెలల్లోనే విద్యుత్ కొరత నుంచి బయటపడ్డామని, తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అమ్మే స్థాయికి చేరిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే అందరు ఎందుకని హేళన చేశారు, కానీ కాళేశ్వరం మొదటి చుక్క హుజూరాబాద్ కె వచ్చిందని హరీష్ రావు వివరించారు.

నాటి బీడు భూముల్లో నేడు వరి ధాన్యం పండుతుందని, దేశంలో అత్యధిక వరిపండించే రాష్ట్రం తెలంగాణ అని.. ఏడేళ్లలో రాష్ట్రం ఈ ఘటన సాధించిందని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ గుణాత్మకంగా ఎదిగిందని హరీష్ రావు తెలియచేశారు. బీజేపీ ప్రభుత్వం 7 ఏళ్లలో 7 శాతం ఫిట్మెంట్ ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని తెలిపారు హరీష్. ఇక ఇదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై విమర్శలు గుప్పించారు.

ఎంపీగా గెలిచిన తర్వాత 2 లక్షల పనైనా చేయించాడా అని విరుచుకుపడ్డాడు. సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని హరీష్ రావు అన్నారు. హుజూరాబాద్ లో బొట్టు పిల్లకు ఆసరా పెన్షన్ కు పోటీ అని వ్యాఖ్యానించారు.