BRS MLA Harish Rao : బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ గురించి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ కు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

BRS MLA Harish Rao

Bigg Boss Telugu 7 :  పదిహేను వారాలపాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 7 ఆదివారం రాత్రి ముగిసింది. 14 మందితో మొదలైన ఈ రియాల్టీ షోలో ఎలిమినేట్ ప్రక్రియలో ఒక్కొక్కరూ హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉండగా.. వారిలో ఆదివారం రాత్రి విజేతను ప్రకటించారు. రైతు బిడ్డగా పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. దీంతో ప్రశాంత్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రముఖులుసైతం ప్రశాంత్ ను సోషల్ మీడియా వేదికగా అభినందించారు. మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ట్విటర్ వేదికగా విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : VC Sajjanar : బిగ్‌బాస్ ఫ్యాన్స్‌పై స‌జ్జ‌నార్ ఫైర్ .. వాళ్లపై చర్యలు తప్పవంటూ హెచ్చరిక

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7 విజేతగా నిలిచిన మా సిద్ధిపేట రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు శుభాకాంక్షలు. బిగ్‌బాస్‌ షోలో తన ప్రదర్శన ద్వారా పల్లవి ప్రశాంత్ అందరి ఇళ్లలో ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయాడు. సీజన్ ఆసాంతం సామాన్యుడి దృఢమైన సంకల్పానికి ప్రతీకగా నిలిచాడని హరీష్ రావు అభినందించారు. పంట పొలాల నుంచి బిగ్ బాస్ షో వరకు సాగిన అతని ప్రయాణం వీక్షకుల హృదయాలను దోచుకున్నందని హరీశ్ రావు పేర్కొన్నారు.