VC Sajjanar : బిగ్‌బాస్ ఫ్యాన్స్‌పై సజ్జనార్ ఫైర్ .. వాళ్లపై చర్యలు తప్పవంటూ హెచ్చరిక
బిగ్‌బాస్ ఫ్యాన్స్ పై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. కొందరు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారని, వారి దాడిలో ఆరు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయని అన్నారు.

VC Sajjanar
Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ ఫ్యాన్స్ పై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్ అయ్యారు. ఇదేం అభిమానం అంటూ ప్రశ్నించారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదంటూ సూచించారు. ఆదివారం రాత్రి కొందరు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారని, వారి దాడిలో ఆరు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయని అన్నారు. ఈ మేరకు బస్సులు ధ్వంసమైన ఫొటోలను ట్విటర్ లో సజ్జనార్ పోస్ట్ చేశారు. అయితే, ఈ ఘటనకు కారణమైన బాధ్యులను వదిలిపెట్టమని సజ్జనార్ హెచ్చరించారు.
ఆదివారం రాత్రి కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో వద్ద బిగ్ బాస్ -7 ఫైనల్ విజేతల ఎంపిక జరిగింది. ఈ సందర్భంగా రాత్రి సమయంలో బిగ్ బాస్ అభిమానులు, పలువురు కటెస్టెంట్స్ మద్దతుదారులు భారీ సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు తమ అభిమాన కంటెస్టెంట్స్ కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియో ప్రాంతంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అభిమానం పేరుతో కొందరు యువకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో అటువచ్చిన ఆర్టీసీ బస్సులపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో ఆరు బస్సులకు అద్దాలు పగిలాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Pallavi Prashanth : బిగ్‌బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్.. ప్రైజ్ మనీ ఎంత? ఇంకేమేమి గెలుచుకున్నాడు?
బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో ఆరు బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారని సజ్జనార్ ట్విటర్ లో పేర్కొన్నారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. బస్సులపై దాడిచేసిన వారిపై చర్యలు ఉంటాయని సజ్జనార్ హెచ్చరించారు.
ఇదేం అభిమానం!
బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023