Pallavi Prashanth Fans : అమర్‌తో పాటు వేరే కంటెస్టెంట్స్, కార్లపై దాడి చేసిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్.. బిగ్‌బాస్ హౌస్ ముందు వార్నింగ్స్ ఇస్తూ రచ్చ..
నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియో బయట ప్రశాంత్ ఫ్యాన్స్, ప్రశాంత్ మనుషులు భారీగా వచ్చారు. ప్రశాంత్ కంటే ముందే బయటకి వచ్చిన పలువురు కంటెస్టెంట్స్ పై, వారి కార్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. రాళ్లతో కార్ అద్దాలు పగలగొట్టారు.

Pallavi Prashanth Fans : బిగ్‌బాస్ సీజన్ 7 నిన్నటితో పూర్తయింది. ఈ సీజన్ 14 మందితో మొదలై ఆ తర్వాత మరో అయిదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీతో రాగా బిగ్‌బాస్ 15 వారాలు సాగి ఫైనల్ కి ఆరుగురిని మిగిల్చారు. ఇక ఫైనల్ లో అమర్ దీప్ ని రన్నరప్ గా ప్రకటించి విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించారు.
ఇక పల్లవి ప్రశాంత్ విన్నర్ అని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. రైతు బిడ్డ సింపతీతో, ఏడుపులతో ఫైనల్ వరకు వచ్చి మొత్తానికి విన్ అయ్యాడు ప్రశాంత్. అయితే ప్రశాంత్ మనుషులు, అభిమానులు ముందు నుంచి సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. హౌస్ లో ప్రశాంత్ ని ఎవరన్నా ఏమన్నా అంటే పల్లవి ప్రశాంత్ అభిమానులు వేరే కంటెస్టెంట్స్ పై, వాళ్ళ ఫ్యామిలీలపై సోషల్ మీడియాలో అసభ్య పదాలతో కూడా దాడి చేశారు. సందీప్ ఫ్యామిలీ డైరెక్ట్ గా వచ్చి ప్రశాంత్ ఫ్యాన్స్ మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పారు.
ఫైనల్ ఎపిసోడ్ రోజు బిగ్ బాస్ హౌస్ ముందు అభిమానులు ఉంటారని తెలిసిందే. వాళ్ళ ఫేవరేట్ కంటెస్టెంట్ బయటకి వచ్చాక ఊరేగింపుగా తీసుకెళ్తారు. అయితే నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియో బయట ప్రశాంత్ ఫ్యాన్స్, ప్రశాంత్ మనుషులు భారీగా వచ్చారు. ప్రశాంత్ కంటే ముందే బయటకి వచ్చిన పలువురు కంటెస్టెంట్స్ పై, వారి కార్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. రాళ్లతో కార్ అద్దాలు పగలగొట్టారు.
అమర్ దీప్, అశ్విని, హర్ష, శోభాశెట్టి, గీతూ.. ఇలా పలువురు కంటెస్టెంట్స్ కార్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేసి కార్ అద్దాలు పగలకొట్టి డ్యామేజ్ చేశారు. దీనిపై కంటెస్టెంట్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గీతూ అయితే అక్కడ ఉన్న యూట్యూబ్ మీడియాతోనే ఈ దాడిపై మాట్లాడింది. తర్వాత తన సోషల్ మీడియాలో కూడా తన కార్ పగలకొట్టిన వాడ్ని పట్టుకుంటే పదివేలు ఇస్తా అని పోస్ట్ చేసింది. ఇక అశ్విని తన కార్ ని డ్యామేజ్ చేసారంటూ, కొత్త కార్ అంటూ వీడియో పోస్ట్ చేసింది. దీనిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇక ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ ఫ్యామిలీ కార్ పై కూడా దాడి చేసి బయటకి దిగమంటూ రచ్చ చేశారు. దీంతో అమర్ ఫ్యామిలీ భయపడ్డారు.
మిగిలిన కంటెస్టెంట్స్ వారిపై జరిగిన దాడికి స్పందించాల్సి ఉంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసిన వీడియోలు ప్రస్త్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్స్, వేరే కంటెస్టెంట్స్ అభిమానులు పల్లవి ప్రశాంత్ అభిమానులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక అమర్ దీప్ విన్ అవ్వాల్సింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ ప్రశాంత్ ఫ్యాన్స్ కి భయపడి అతని ఇచ్చారు అని కూడా పలువురు ఆరోపిస్తున్నారు.
BiggBoss Geethu Royal Open Offer#GeethuRoyal #BiggBossTelugu7 #PallaviPrashanth #Amardeep pic.twitter.com/7SrHKGRuWf
— Vikram Kiran (@vikramkiran27) December 18, 2023
#PallaviPrashanth Fans Attacked #Amardeep Car Live Visuals ??#BiggBossTelugu7GrandFinale #BiggBoss7Telugu #Shivaji pic.twitter.com/MedJdo5qm7
— Devara (@TotallyNtr) December 18, 2023
#PallaviPrashanth fans threatening amardeep #biggbosstelugu7 really why తెలంగాణా youth wants turn like this a timepass reality show pic.twitter.com/Qdlowl9vVS
— telugu guy (@nthony_venky) December 18, 2023
#BiggBossTelugu7 #PallaviPrashanth #Amardeep #BiggBoss7Telugu pic.twitter.com/UMDixoZ5B2
— Movies4u Official (@Movies4u_Officl) December 18, 2023
#BiggBoss7Telugu
Run Raja Runn…..!!#PallaviPrashanth fans? https://t.co/lXvCLOnF9q pic.twitter.com/9fjHpqKYHK— Jay (@Jay48630516) December 18, 2023