మా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చాం: హరీశ్ రావు

ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోయేందుకు సర్కారు ఏప్రిల్ నెలలో ఎక్కడికక్కడ మేకర్లకు సీల్ వేసి, లాక్..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రపురం సమీపంలో సాగర్ ఎడమ కాలువ వద్దకు వచ్చామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించామని, వరద నష్టాన్ని అంచనా వేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వచ్చిందని వివరించారు.

ఎడమ కాలువ తెగి పోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, కేవలం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని అన్నారు. ఇసుక మేటలు వేసిన పొలాలకు ఎకరాకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు కలిగిన నష్టంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరమూ కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తెలిపారు. రైతులందరికీ న్యాయం చేసేందుకు తమ పోరాటమని అన్నారు.

జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు నీళ్లు తీసుకుపోయేందుకు సర్కారు ఏప్రిల్ నెలలో ఎక్కడికక్కడ మేకర్లకు సీల్ వేసి, లాక్ వేసిందని తెలిపారు. వాటిని మళ్లీ ఓపెన్ చేయలేదని, ఆ పాపం వల్లనే ఇప్పుడు రామచంద్రాపురం వద్ద ఎడమ కాల్వకు గండి పండిందని చెప్పారు.

వేల ఎకరాలు మట్టి కొట్టుకుపోయాయని, రైతులకు తీరని దుఃఖం మిగిలిందని తెలిపారు. భారీ వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అయిందని, సీఎం రేవంత్ రెడ్డి అనాలోచితంగా, అవగాహన రహితంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. తమపై ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని అన్నారు.

Also Read: ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​.. తొమ్మిది మంది మావోలు మృతి

ట్రెండింగ్ వార్తలు