Chhattisgarh : ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​.. 10 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్‌కౌంట‌ర్‌ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు.

Chhattisgarh : ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​.. 10 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh Encounter

Chhattisgarh Encounter : ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో మావోల ఉనికిపై నిఘా వర్గాలు సమాచారం మేరకు బస్తర్ జిల్లాలోని దంతెవాడ వద్ద జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సంయుక్త బృందం సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో జవాన్లు, మావోల మధ్య కాల్పులు జరిగాయి. ఘటన స్థలంలో ఎస్ఎల్ఆర్, 303, 12 బోర్ ఆయుధాలతోపాటు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఈ ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న జవాన్లందరూ సురక్షితంగా ఉన్నారు. గతవారం ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో పోలీస్ ఇన్ ఫార్మర్లు అనే అనుమానంతో వేరువేరు సంఘటనల్లో ముగ్గురు గ్రామస్తులను మావోయిస్టులు చంపారు.