Harish Rao : కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అతని అనుచరులు వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని హరీశ్ రావు అన్నారు.

BRS MLA Harish Rao,

BRS MLA Harish Rao : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా ఖండిచారు. ఇదేం ప్రజాస్వామ్యం.. ఇదేం ప్రజాపాలన.. ఇదేం ఇందిరమ్మ రాజ్యం అంటూ హరీశ్ రావు అగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతోపాటు.. వారినే ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది. రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Also Read : కౌశిక్ రెడ్డి నివాసంకు అరెకపూడి గాంధీ.. అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అతని అనుచరులు వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని హరీశ్ రావు అన్నారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టం. ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : TG Cabinet : తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం.. రేసులో ముందున్న నేతలు వీళ్లే..

పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దాడిచేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవటంతో.. సిద్ధిపేట నుంచి కౌశిక్ రెడ్డి నివాసానికి హరీశ్ రావు బయలుదేరి వెళ్లారు.

 

ట్రెండింగ్ వార్తలు