కౌశిక్ రెడ్డి నివాసంకు అరెకపూడి గాంధీ.. అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

పోలీసులు అడ్డుకోవటంతో కౌశిక్ రెడ్డి నివాసం గేటు ఎదుటే అరికపూడి గాంధీ, ఆయన వర్గీయులు బైఠాయించారు. దీంతో పోలీసులు గాంధీని బలవంతంగా అదుపులోకి తీసుకొని

కౌశిక్ రెడ్డి నివాసంకు అరెకపూడి గాంధీ.. అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

Arekapudi Gandhi

Arekapudi Gandhi : ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఉదయం 11గంటలకు నీ ఇంటికివచ్చి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతానంటూ అరెకపూడి గాంధీకి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. గాంధీసైతం ధీటుగా స్పందించారు. దమ్ముంటే రా.. నువ్వు రాకుంటే నేనే మీ ఇంటికి వస్తా అంటూ ప్రతి సవాల్ చేశారు. ఉదయం 11గంటల వరకు కూడా కౌశిక్ రెడ్డి రాకపోవటంతో గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి నివాసకు వెళ్లారు. పెద్ద సంఖ్యలో గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి నివాసంవైపు దూసుకురావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అరెకపూడి గాంధీ పోలీసులను తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేటును బద్దలు కొట్టేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Also Read : TG Cabinet : తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం.. రేసులో ముందున్న నేతలు వీళ్లే..

పోలీసులు అడ్డుకోవటంతో కౌశిక్ రెడ్డి నివాసం గేటు ఎదుటే అరికపూడి గాంధీ, ఆయన వర్గీయులు బైఠాయించారు. దీంతో పోలీసులు గాంధీని బలవంతంగా అదుపులోకి తీసుకొని మాధాపూర్ స్టేషన్ కు తరలించారు. అంతకు ముందు గాంధీ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి మీ ఇంటికి వచ్చా.. నీ ఇంటి వద్ద పోలీసులను పెట్టుకున్నావ్.. దమ్ముంటే బయటకు రా.. అంటూ గాంధీ సవాల్ చేశాడు. కాంగ్రెస్ లో జరుగుతున్న విషయాలను ఇతర పార్టీలకు చెప్పిన కోవర్టు కౌశిక్ రెడ్డి. అందుకే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఈ దొంగ మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యే అయ్యి ఏడాది కూడా కాలేదు.. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. క్రిమినల్ అని తెలిసి గతంలో ఎమ్మెల్సీ పదవికి గవర్నర్ తిరస్కరించారని అరికపూడి గాంధీ అన్నారు.

 

ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. బతకడానికి కరీంనగర్ నుంచి కౌశిక్ రెడ్డి వచ్చాడు.. ప్రజల మధ్య కౌశిక్ రెడ్డి చిచ్చు పెడుతున్నాడని గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మహిళా గవర్నర్ ను అవమానపర్చావు.. ప్రతిసారి మహిళలను కించపర్చేలా మాట్లాడుతున్నాడు. నీకు తల్లి, చెల్లి లేదా? అంటూ కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.