Harishrao Kondapur Area Hospital
HarishRao Kondapur Area Hospital : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆ సమయంలో ఆసుపత్రిలోని ఓ డాక్టర్ లంచావతారంపై కొందరు మంత్రికి ఫిర్యాదు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు డాక్టర్ మూర్తి డబ్బులు అడిగారని బాధితులు మంత్రితో చెప్పారు.
Harish Rao suspends doctor at Kondapur Area Hospital for demanding bribe from patients
ISB Anniversary: మే 26న ఐఎస్‌బీ వార్షికోత్సవానికి రానున్న ప్రధాని: కేసీఆర్‌కూ ఆహ్వానం..కానీ!
దీన్ని మంత్రి హరీశ్ సీరియస్ గా తీసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ లంచం అడిగిన విషయం నిజమే అని తెలిసింది. ఆ వెంటనే డాక్టర్ పై యాక్షన్ తీసుకున్నారు. డాక్టర్ మూర్తిపై అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు చేశారు మంత్రి హరీశ్. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. ఇతర సిబ్బంది కూడా జాగ్రత్తగా ఉండాలని, లంచాలు, అవినీతి జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు.
Harish Rao suspends doctor at Kondapur Area Hospital for demanding bribe from patients
Telangana Covid Bulletin Report : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే
గైనకాలజీ వార్డులో ప్రతిరోజూ స్కానింగ్ లు నిర్వహించాలని మంత్రి హరీశ్ ఆదేశించారు. అందుకోసం అదనంగా రెండు అల్ట్రా సౌండ్ మిషన్లు పంపుతామని మంత్రి హామీ ఇచ్చారు. గైనకాలజీ వార్డులో సదుపాయాలు పరిశీలించిన మంత్రి హరీశ్ రావు, 60శాతానికి పైగా సాధారణ డెలివరీలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో వివిధ వార్డులను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు.. వైద్య సేవల తీరు ఎలా ఉందో పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి @trsharish గారు కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక సందర్శన. pic.twitter.com/pVfy3Dm1ce
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 23, 2022
మరోవైపు రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో త్వరలోనే మరిన్ని బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
Harish Rao suspends doctor at Kondapur Area Hospital for demanding bribe from patients
ఆసుపత్రి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సానిటేషన్ కార్మికులతో చెప్పారు మంత్రి హరీశ్ రావు.