Telangana Covid Bulletin Report : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే
రాష్ట్రంలో ఇప్పటివరకు 7లక్షల 92వేల 871 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా... 7లక్షల 88వేల 363 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 397 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Telangana Covid Bulletin Report : తెలంగాణలో కరోనా రోజువారీ కేసులో కనిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 8,260 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 29 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ లో 24 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 3, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1 కేసు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 39 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో ఇంకా 397 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. రాష్ట్రంలో ఇప్పటివరకు 7లక్షల 92వేల 871 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… 7లక్షల 88వేల 363 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Monkeypox : ఇజ్రాయెల్‌లో మొదటి మంకీపాక్స్ కేసు.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త..!
అటు దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 2వేల 500లోపే నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. మరోవైపు యాక్టివ్ కేసులు కూడా 15 వేల దిగువనే కొనసాగుతున్నాయి. నిన్న 4లక్షల 42వేల 681కి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 226 మందికి పాజిటివ్ గా తేలింది.
అదే సమయంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 65 మంది చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కొవిడ్ తో మృతి చెందిన వారి సంఖ్య 5లక్షల 24వేల 413కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 2వేల 202 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.25 కోట్లు (98.75%) దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14వేల 955 (0.03%) కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 14,37,381 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 192.28 కోట్లు దాటింది.
మరోవైపు కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చి.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతున్న బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో భారత్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా.. త్వరలోనే 200 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోనుంది.
North Korea: నార్త్ కొరియాకు వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమన్న అమెరికా.. కిమ్ ఏమన్నాడంటే..
కాగా, ప్రతి లబ్ధిదారునికి వ్యాక్సిన్ అందించేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ముఖ్యంగా వచ్చే రెండు నెలలు (జూన్, జులై) ‘హర్ ఘర్ దస్తక్ 2.0’ పేరుతో ఇంటింటికీ వెళ్లి టీకా పంపిణీ చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని రాష్ట్రాల వైద్యాధికారులకు స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమాలు, స్కూళ్లు, కాలేజీలు, ఖైదీలు, ఇటుక బట్టీల వంటి ప్రాంతాల్లో పనిచేసేవారు, విద్యకు దూరమైన చిన్నారులకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది. ముఖ్యంగా 12 నుంచి 14ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ తక్కువగా ఉండడం, మరోవైపు ఆ వయసువారికి కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నందున వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.22.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/F5bAqgy8Bd— IPRDepartment (@IPRTelangana) May 22, 2022
- Telangana Covid Updated List : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
- Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
- Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
- Telangana Corona Terror News : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
- Telangana Covid Cases Updated : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పెరిగిన కేసులు
1Udaipur Killing: ఉదయ్‌పూర్ హత్యపై 16ఏళ్ల బాలిక ఫేస్బుక్ పోస్ట్.. చంపేస్తామంటూ బెదిరింపులు
2Kali Poster: కాళీ పోస్టర్ తర్వాత కన్యాకుమారిలో శివుడు సిగరెట్ అంటించుకుంటున్న పోస్టర్
3MLA Angada Kanhar : ఏజ్.. జస్ట్ నెంబర్ మాత్రమే.. 58ఏళ్ల వయసులో టెన్త్ పాసైన ఎమ్మెల్యే
4Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం
5Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్
6Heavy rain: రేపు ఆ ఆరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం..
7Smriti Irani: స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యాకు అదనపు శాఖలు
8London: బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని బోరిస్‌కు షాకిచ్చిన మరో ఐదుగురు మంత్రులు..
9Pragya Jaiswal: అందాలతో ఫిదా చేస్తున్న ప్రగ్యా జైస్వాల్
10Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
-
Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
NBK107: దేశం మారుస్తున్న బాలయ్య.. ఎందుకో తెలుసా?