Harish Rao: వారిని కాళేశ్వరం కాలువలో ముంచితే నిజం తెలుస్తది: హరీశ్ రావు

Harish Rao: తెలంగాణలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక నేతల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మంత్రి హరీశ్ రావు హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు.

Harish Rao (Photo : Twitter)

Harish Rao: ఎన్నికలు వచ్చాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీ నిందలు వేస్తున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక నేతల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి మంత్రి హరీశ్ రావు, జడ్పీ చైర్మన్ రోజా శర్మ, మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… “కాళేశ్వరం లేకుంటే ఇన్ని లక్షల ఎకరాలు నీరు ఎలా పారేది? ఢిల్లీలో, గాంధీ భవన్ లో కూర్చొని కాళేశ్వరం దండగా అంటే అన్నోళ్లను తీసుకొచ్చి కాళేశ్వరం కాలువలో ముంచితే పండగో దండగో తెలుస్తది. కేసీఆర్ లేకుంటే రాష్ట్రం వచ్చేది కాదు.. జిల్లా ఏర్పాటు అయ్యిది కాదు.. ప్రాజెక్ట్ లు నిర్మాణం అయ్యేవి కాదు.

సిద్దిపేట ట్యాగ్ లైన్ నీళ్ళు, నిధులు, నియామకాలు అనేవి ఉండే. అర్బన్ మండలం సిద్దిపేటకు హైటెక్ సిటీ అయింది. అభివృద్ధిలో ఈ మండలం దూసుకుపోతుంది. మిట్టపల్లి నుంచి సిద్దిపేట వరకు పోర్ లైన్ తో పాటు రంఘదాంపల్లి వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆకలి చావులు లేవు. రైతులను కేసీఆర్ బలోపేతం చేసిండు.. అందుకే భూమి విలువ పెరిగింది.

నాటి కాంగ్రెస్ పార్టీకి నేటి బీఆర్ఎస్ పార్టీకి పొంతన లేదు. మన అభివృద్ధి తెరిచిన పుస్తకంలా ఉంది, మన పథకాలు అందని ఇల్లు లేదు. కల్యాణ లక్ష్మి రాకముందు బాల్యవివాహాలు జరిగేవి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ఏ ఒక్క మంచి పని జరగలేదు. ధరలు పెంచడం, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం తప్ప ఏం చేయలేదు. బీజేపీవి అన్నీ పడగొట్టే పనులు అయితే కేసీఆర్ వి నిలబెట్టే పనులు.

బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూలగొడుతా, కాల్చుతా అంటున్నారు. ఎమ్మెల్యేను కొనడం ప్రభుత్వాలను పడగొట్టడం, ఈడీలను పంపడం తప్ప ఏం లేదు. బండి సంజయ్ మాటలు బూతులు తప్ప రైతులపై ప్రేమ లేదు. బీజేపీ చెప్పేది అన్నీ అబద్ధాలు. బీజేపీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పి డీజిల్, పెట్రోల్ ధరలు రెట్టింపు చేసింది” అని హరీశ్ రావు అన్నారు.

YS viveka case : ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌లో కీలక అంశాలు.. వివేకా,సునీతారెడ్డిపై తీవ్ర ఆరోపణలు