YS viveka case : ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌లో కీలక అంశాలు.. వివేకా,సునీతారెడ్డిపై తీవ్ర ఆరోపణలు

గూగుల్ టేకౌట్ ఆధారంగానే నన్ను నిందితుడిగా చేర్చారని.. దస్తగిరి వాల్మూలంతో నన్ను ఈ కేసులో ఇరికించాలనే కుట్రలు జరుగుతున్నాయని కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇప్పించాలని కోరుతు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పిటీషన్ వేశారు.

YS viveka case : ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌లో కీలక అంశాలు.. వివేకా,సునీతారెడ్డిపై తీవ్ర ఆరోపణలు

YS viveka case..Avinash reddy

YS viveka case :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ లో కీలక అంశాలను పేర్కొన్నారు. వివేకా హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదని..దస్తగిరి వాంగ్మూలంతో నన్ను ఇరికించటానికి కుట్ర పన్నారని కాబట్టి నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండీ అంటూ పేర్కొన్నారు. కేవలం గూగుల్ టేకౌట్ ఆధారంగానే నన్ను నిందితుడిగా చేర్చే యత్నం సీబీఐ చేస్తోందని..దస్తగిరిని సీబీఐ ఢిల్లీకి పిలిపించుకుని తన వద్దే ఉంచుకుని అప్రూవర్ గా మార్చిందని ఆరోపిస్తూ..అలాంటి దస్తగిరి వాల్మూలంతో నన్ను ఈ కేసులో ఇరికించాలనే కుట్రలు జరుగుతున్నాయని..161 CRPC కింద సీబీఐ నోటీసులిచ్చారని పేర్కొన్నారు.

ఈకేసులో నాపై ఎటువంటి ఆధారాలు లేవని..విచారణలో తాను వెల్లడించినవాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేవలం దస్తగిరి స్టేట్ మెంట్ ఒక్కటే ప్రామాణికంగా సీబీఐ తీసుకుందని ఆరోపించారు. వివేక రెండో వివాహాం చేసుకున్నారని రెండో భార్య కుమారుడికి హైదరాబాద్ లో పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తానని వివేకా హామీ ఇచ్చారంటు పేర్కొన్నారు. వివేకా తన రెండో భార్యతో ఆర్థిక వ్యవహారాల్లో పాలు పంచుకోవటాన్ని జీర్ణించుకోలేని సునీతారెడ్డి తన తండ్రి అయిన వివేకాపై కక్ష కట్టారని లంచ్ మోషన్ లో అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ మరోసారి అవినాశ్ రెడ్డికి విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. దీంతో మధ్యాహ్నాం 3.00గంటలకు అవినాశ్ విచారణకు హాజరవనున్నారు. ఈ సందర్భంగా విచారణ తరువాత తన అరెస్ట్ అనివార్యమని భావించిన అవినాశ్ రెడ్డి విచారణకు హాజరుకాకుండానే ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు.

YS viveka case : అరెస్ట్ భయంతో .. ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్

కాగా వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని ఐదవ సారి విచారణకు ఆదేశించింది సీబీఐ. ఈ హత్య కేసులో ఇప్పటికే అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో తనను విచారణ చేసిన అనంతరం సీబీఐ అరెస్ట్ చేస్తుందనే ఆందోళనతో అవినాశ్ రెడ్డి చీఫ్ జస్టిస్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషనలో హత్యకు గురి అయిన వివేకానందరెడ్డిపైనా..ఈ హత్య కేసులో నేరస్థులు ఎవరో తెలియాలని పోరాడుతున్న వివేకా కుమార్తె సునీతారెడ్డిపై అవినాశ్ రెడ్డి పైనా పేర్కొన్న తీవ్ర ఆరోపణలు చేశారు.

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సహనిందితుడిగా చేర్చి విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ నోటీసుల ఆదేశానుసారం విచారణకు హాజరుకావటానికి పులివెందుల నుంచి అవినాశ్ రెడ్డి తన అనుచరులతో హైదరాబాద్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌ అనుచరుడు ఉదయ్‌ కుమార్‌ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఇటువంటి పరిస్థితుల్లో తండ్రి భాస్కర్ రెడ్డిని అనూహ్యంగా అరెస్ట్ చేసినట్లుగానే అవినాశ్ రెడ్డిని విచారణ తరువాత సీబీఐ అరెస్ట్ చేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.

YS Avinash Reddy : ఎంపీ అవినాశ్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు.. ఏం జరగనుంది?