Rythu Bandhu Politics In TS : తెలంగాణలో రైతు బంధు రాజకీయం .. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

ఇప్పటికే తెలంగాణ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య హీట్ పుట్టిస్తుంటే..తాజాగా రైతు బంధు ఆ వేడికి మరింత వేడిని రాజేసింది. రైతు బంధు సాయం పంపిణికి ఈసీ ఉపసంహరించుకుంటు చేసిన ప్రకటన రాష్ట్రంలో మాటల దాడికి కారణమైంది.

Heat Politics on Disbursal of Rythu Bandhu

Heat Politics on Disbursal of Rythu Bandhu : ఇప్పటికే తెలంగాణ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య హీట్ పుట్టిస్తుంటే..తాజాగా ఆ వేడికి రైతు బంధు మరింత వేడిని రాజేసింది.రైతు బంధు సాయం పంపిణి ఈసీ ఉపసంహరించుకుంటు చేసిన ప్రకటన రాష్ట్రంలో మాటల దాడికి కారణమైంది. దీంతో తెలంగాణలో ‘రైతు బంధు’ చుట్టే రాజకీయం అంతా తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంటు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 28లోపు రైతు బంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దీన్నే మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించింది.

దీంట్లో భాగంగానే నవంబర్ 28 నుంచి రైతుబంధు పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఈక్రమంలో జరిగిన పరిణామాలతో మరోసారి బీఆర్ఎస్  ప్రభుత్వానికి  షాకిస్తు ఈసీ ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది. అదే విషయాన్ని ఈసీ.. రైతుబంధు సాయం పంపిణీని ఉపసంహరించుకుంటు చేసిన ప్రకటనలో పేర్కొంది.నవంబర్ 28 నుంచి రైతుబంధు పంపిణీ చేస్తామన్న మంత్రి హరీశ్ రావు ప్రకటనను ప్రస్తావించింది.

రైతులకు షాకింగ్ న్యూస్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. నిధుల విడుదలకు మళ్లీ బ్రేక్

దీంతో రైతుబంధు చుట్టూ రాజకీయం తిరుగుతు మరింత హీటెక్కిస్తోంది. కాంగ్రెస్ కుట్రవల్లే రైతు బంధు సాయం ఆగిపోయింది అంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ను కార్నర్ చేసేందుకు ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఉపయోగించుకుంటు ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అంటూ దుయ్యబడుతున్నారు. అందుకే రైతు బందుని నిలిపివేశాలా చేయటమే కాకుండా రోజుకు 24గంటలు విద్యుత్ వద్దు మూడు గంటలే చాలు అంటున్నారని విమర్శిస్తున్నారు.  రైతు బంధుకు ఈసీ అనుమతి ఇచ్చిందని మాత్రమే తాను చెప్పానని హరీశ్ రావు వివరణ ఇస్తు.. ఈసీకి ఫిర్యాదులు చేసి రైతుబంధు సాయాన్ని ఎన్ని రోజులు ఆపుతారు..? అంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు.

దీనిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కౌంటర్ఎటాక్ ఇస్తు..హరీశ్ రావు చేసిన ప్రకటనవల్లే రైతు బంధు ఆగిపోయిందని ఎదురు దాడికి దిగారు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉంటే..రైతు బంధు విషయంలో అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ప్రభుత్వం రైతుబంధు నిధులు ఎందుకు వేయలేదు?అని ప్రశ్నించారు  కిషన్ రెడ్డి. రెండు పార్టీలు రైతు బంధు విషయంలో డ్రామాలాడుతున్నాయంటూ ఎదురుదాడికి దిగారు. దళితబంధుపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని..రైతుబంధు, దళితబంధుపై ఫిర్యాదు చేయటం కాంగ్రెస్ కు అలవాటే అంటూ విమర్శించారు. డైరెక్ట్ గా గెలిచే సత్తా లేక.. రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

రైతు బంధు సాయాన్ని ఎన్ని రోజులు ఆపుతారు..? : హ‌రీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

ఇలా బీజేపీ అగ్రనేతలు, కాంగ్రెస్ అగ్రనేతలు సైతం తెలంగాణలో పర్యటిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో రైతు బంధు రాజీకీయం హీటెక్కుతోంది. ఈసీ తాజాగా చేసిన ప్రకటనతో రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ పడనుండటంతో రాజకీయం మరింత రంజుగా మారింది.