Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగింది. సాయంత్రం నుంచి ఉదయం 8 గంటల వరకు వీస్తున్న చలిగాలులతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో గత రాత్రి అత్యల్పంగా 7.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 9.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అన్నారు.
Also Read: భారత్‌లో గంగా, యమున నదులను మురికిమయం చేసింది సరిపోలేదా? ఇంగ్లాండ్‌లోని నదిలో భారతీయుడు చేసిన పనికి..
మరోవైపు, ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని, నవంబరు 21 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉండడంతో వర్షాలు పడతాయని అధికారులు వివరించారు.
రాగల రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అన్నారు.