భారత్‌లో గంగా, యమున నదులను మురికిమయం చేసింది సరిపోలేదా? ఇంగ్లాండ్‌లోని నదిలో భారతీయుడు చేసిన పనికి..

"భారతీయులు ఇటువంటి పనులు ఎందుకు చేస్తారు?” అని ఓ యూజర్ ప్రశ్నించాడు.

భారత్‌లో గంగా, యమున నదులను మురికిమయం చేసింది సరిపోలేదా? ఇంగ్లాండ్‌లోని నదిలో భారతీయుడు చేసిన పనికి..

River

Updated On : November 16, 2025 / 10:07 PM IST

Viral Video: భారత్‌లోని నదులను దేవతలుగా కొలుస్తాం. అయినప్పటికీ మన దేశంలోని నదులు కాలుష్యమయంగా ఉంటాయని తీవ్ర విమర్శలు ఉన్నాయి. నదుల్లో మురికి నీటిని వదలడం, కాళ్లు కడగడం వంటివే కాకుండా చాలా మంది మూత్ర విసర్జన వంటి పనులూ చేస్తుంటారు.

అనేక దేశాల్లోని నదులు ఎంతో సుందరమయంగా, కాలుష్యరహితంగా ఉంటాయి. మన దేశంలోని నదుల్లో కాళ్లు కడగడం ఎంతో సాధారణమైన విషయం. అనేక దేశాల్లోని నదుల్లో చేతులు కడిగినా తప్పే.

తాజాగా, లండన్‌లోని థేమ్స్ నదిలో ఓ భారతీయుడు కాళ్లు కడుగుతున్న వీడియో వైరల్ అయింది. నది ఒడ్డుపై నిలబడి అతడు కాళ్లు కడుగుతున్నట్టు క్లిప్‌లో కనిపించాడు. అతను ఆ తర్వాత నదిలో స్నానం కూడా చేసినట్టు కొందరు అంటున్నారు.

థేమ్స్ నది కేవలం ప్రధాన జలమార్గం మాత్రమే కాదు. లండన్ నగరానికి ప్రతీకగా నిలిచే ప్రసిద్ధ స్థలంగానూ గుర్తింపు పొందింది. నగర మధ్యభాగం మీదుగా ప్రవహించే ఈ నది పక్కన పార్లమెంట్ హౌసెస్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జ్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఉంటాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. నదుల్లో కాళ్లు కడగడం ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

“లండన్ థేమ్స్ నదిలో భారతీయుడు కాళ్లు కడుగుతున్నాడు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులు ఇటువంటి పనులు ఎందుకు చేస్తారు?” అని ఓ యూజర్ ప్రశ్నించాడు.

“మీ దేశంలో గంగా, యమునా నదులు సరిపోలేదా, థేమ్స్ నదిని కూడా గంగా, యమునా నదుల్లా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు” అని మరో యూజర్ కామెంట్ చేశాడు.

అసలు ఆ నదిని చూస్తే అందులో కాళ్లు కడగాలని ఎలా అనిపించిందని కొందరు ప్రశ్నించారు.

“అన్నా.. అక్కడ కాళ్లు కడగొద్దు. ఈ నీళ్లను తాగుతారు, దయచేసి కడగొద్దు” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.

పర్యావరణ కార్యకర్తలు ఇటీవల థేమ్స్ నదిలోని పలు చోట్ల కాలుష్యాన్ని గుర్తించారు. మన శరీరం సహా జలాల్లో కనిపించే ఈ.కోలి (E.coli) బ్యాక్టీరియాను ఆ ప్రాంతంలో అధిక స్థాయిలో ఉందని కనుగొన్నారు.