భారీ వర్షాలకు నీట మునిగిన భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన ప్రాంతం

పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద పోటెత్తింది.

Bhadrachalam Floods: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన ఆలయ అన్నదాన సత్రం భారీ వర్షాలకు నీట మునిగింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షానికి రామాలయ ప్రాంతం తడిసి ముద్దయింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినా ఇరిగేషన్ అధికారుల తీరు మారలేదు. గోదావరి నది కరకట్ట స్లూయిజ్ ల నుంచి వర్షపు నీటిని పంప్ చెయ్యకపోవడం వల్ల మరో సారి నీట మునిగింది రామాలయ ప్రాంతం.

పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద పోటెత్తింది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులుకాగా, ప్రస్తుత నీటిమట్టం 404.10అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 4,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 10,000 క్యూసెక్కులు ఉండడంతో 2 గేట్లు ఎత్తారు. 10,000 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని నదీ ప్రవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గుండాల, ఆళ్ళపల్లి ఏజెన్సీ మండలాలలో భారీ వర్షం కురుస్తోంది.

Also Read: మొబైల్ నెట్వర్క్ మార్చాలని చూస్తున్నారా? ముందు సిగ్నల్స్ చెక్ చేసుకోండి..

మరోవైపు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పెనుబల్లి మండలం లంకాసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 16 అడుగులుగా ఉంటుంది. ప్రస్తుత నీటి మట్టం 16.09 అడుగులకు చెరుకోవటంతో అలుగు పారుతోంది. వేంసూరు మండలంలో అత్యధికంగా 66.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తల్లాడ మండలంలో అత్యల్పంగా 24.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

ట్రెండింగ్ వార్తలు