Heavy rain : హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం

హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. అర్ధరాత్రి దాటాక నగరంలోని పలుప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో వరద నీరు భారీగా రోడ్ల మీదకు చేరింది. పాతబస్తీ, మొఘల్‌పురా, సుల్తాన్‌షాహీ, బహదూర్‌పురా, చార్మినార్‌, ఎల్బీనగర్‌, టోలీచౌక్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్టలో భారీ వర్షం కురిసింది.

Heavy rains : హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. అర్ధరాత్రి దాటాక నగరంలోని పలుప్రాంతాల్లో వాన దంచికొట్టింది. దీంతో వరద నీరు భారీగా రోడ్ల మీదకు చేరింది. పాతబస్తీ, మొఘల్‌పురా, సుల్తాన్‌షాహీ, బహదూర్‌పురా, చార్మినార్‌, ఎల్బీనగర్‌, టోలీచౌక్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్టలో భారీ వర్షం కురిసింది. ఈ రోజు కూడా నగరంలోని అనేక ప్రాంతాలతో పాటు, పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

తెలంగాణలో వచ్చే మూడు రోజులూ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని వెల్లడించిది. ఇక రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Heavy Rains : తెలంగాణాలో మరో 3 రోజులు భారీ వర్షాలు

ఇక నైరుతి రుతుపవనాలు ద్రోణి కారణంగా ఏపీలోనూ వానలు దంచేస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక భారీ వర్ష సూచనతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ట్రెండింగ్ వార్తలు