Heavy Rains : తెలంగాణాలో మరో 3 రోజులు భారీ వర్షాలు

తెలంగాణాలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ పరిసరాల్లో కేంద్రీకృతం అయిన ఆవర్తనం... ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ వైపు మళ్ళింది. సముద్ర మట్టం నుంచి 5 పాయింట్‌ 8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది. ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Heavy Rains : తెలంగాణాలో మరో 3 రోజులు భారీ వర్షాలు

Ts Rain

heavy rains : తెలంగాణాలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ పరిసరాల్లో కేంద్రీకృతం అయిన ఆవర్తనం… ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ వైపు మళ్ళింది. సముద్ర మట్టం నుంచి 5 పాయింట్‌ 8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది. ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

శనివారం ఉన్న ఉత్తర – దక్షిణ ద్రోణి ఆదివారం బలహీనపడింది. ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సర్కార్‌ సూచించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల 28 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Heavy Rains : తెలంగాణలో దంచికొడుతున్న వానలు

ఈనెల 28 వరకు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. గుజరాత్‌, రాజస్తాన్‌, తమిళనాడు, పుదుచ్ఛేరిల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశముంది. అలగే వచ్చే 4 రోజుల్లో హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలోనూ భారీ వర్షాలు పడనున్నాయి.

ఈనెల 26న ఛండీగఢ్‌, పంజాబ్‌, హరియాణాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలోని విదర్భతో పాటు మధ్యప్రదేశ్‌లో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. బెంగాల్‌, సిక్కింలలో జులై 25 వరకు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. బిహార్‌లో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి.