Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రెడ్ అలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు. ఆగస్ట్ 15 ను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ పోర్టులోకి సందర్శకుల అనుమతులు నిలిపివేశారు. అనుమానితులపై సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు నిఘా పెట్టారు. ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న ప్రహరీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీఐఎస్ఎఫ్, రక్షణ సెక్యూరిటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.