Vande Bharat Express : తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఈ రైలు నడుస్తుంది. పండుగ వాతావరణంలో తెలుగు రాష్ట్రాలకు గొప్ప కానుక అని ప్రధాని మోదీ అన్నారు. తెలుగు ప్రజలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ రైలు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి దోహదపడుతుందన్నారు.
హైదరాబాద్-వరంగల్-విజయవాడ-విశాఖ నగరాలను అనుసంధానిస్తూ ప్రయాణం సాగుతుందని, దీంతో సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. పూర్తిగా దేశీయంగా తయారైన వందే భారత్ తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. మారుతున్న దేశ భవిష్యత్తుకి ఇదొక ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు.
వందే భారత్ ప్రత్యేకతలు..
* అత్యంత వేగంగా గమ్య స్థానాలకు చేరుస్తుంది.
* భద్రతతో పాటు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.
* 2023లో ప్రారంభించిన తొలి వందే భారత్ రైలు ఇది.
ఇవాళ(జనవరి 15) ఒక్కరోజు మాత్రమే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రత్యేక వేళల్లో నడుస్తోంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారంపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. రాత్రి 8గంటల 45 నిమిషాలకు విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో 6 రోజుల పాటు ఈ రైలు సేవలు అందిస్తుంది.
Also Read..Vande Bharat Express: మోదీ ప్రారంభించిన వందేభారత్-3 రైలు విశేషాలు ఏంటో తెలుసా?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ప్రారంభోత్స కార్యక్రమానికి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ తమిళి సై, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేశంలో సెమీ బుల్లెట్ రైలుగా గుర్తింపు పొందిన వందే భారత్ రైలు ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని రైలు తరహాలో ఉండటంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ రైలు కోసం అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే 7 రైళ్లు పట్టాలెక్కగా, ఇవాళ సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య 8వ రైలు అందుబాటులోకి వచ్చింది. తెలుపు వర్ణం దానిపై నీలిరంగు చారలు, బుల్లెట్ రైలు తరహాలో లోగో ముందు రూపు, వెడల్పు నల్ల రంగు, కిటికీ వరుస.. ఇలా చూడగానే ఆకట్టుకునే రూపంతో ఈ రైలు పరుగు పెట్టింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
Picturesque!
Glimpses of the #VandeBharat Express passing through the serene green landscape of Raigiri Curve, Telangana. pic.twitter.com/tHqmKRRJax
— Ministry of Railways (@RailMinIndia) January 15, 2023