home minister amit shah
Amit Shah – Telangana Tour Schedule : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారు అయింది. నేడు (గురువారం) హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 10. 20 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో అమిత్ షా చేరుకోనున్నారు. రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో అమిత్ షా బస చేయనున్నారు.
శుక్రవారం ఉదయం 7.50గంటలకు కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఉదయం 8 నుండి 11 గంటల వరకు 75వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ లో అమిత్ షా పాల్గొననున్నారు. ఉదయం 11 నుండి ఒంటిగంట వరకు కేంద్ర హోంమంత్రి షెడ్యూల్ ను అధికారులు రిజర్వు చేసి ఉంచారు.
మధ్యాహ్నం ఒంటిగంట నుండి 2 గంటల వరకు ఎన్పీఏలోని రాజస్థాన్ భవన్ లో అమిత్ షా లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో అమిత్ షా సూర్యాపేటకు బయలేదేరనున్నారు. 3 గంటల 55 నిమిషాలకు సూర్యాపేట సభాస్థలికి చేరుకోనున్నారు.
సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొననున్నారు. సాయంత్ర 5 గంటలకు అమిత్ షా తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో కేంద్ర హోం శాఖ మంత్రి షా తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు.