Telangana Congress : బీఆర్ఎస్ పై గెలుపు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలు.. గులాబీ ముఖ్య నేతలపై హస్తం సీనియర్ నేతలు పోటీ?

గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ కు పోటీగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలోకి దింపేలా కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. 

Telangana Congress : బీఆర్ఎస్ పై గెలుపు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలు.. గులాబీ ముఖ్య నేతలపై హస్తం సీనియర్ నేతలు పోటీ?

Telangana Congress new strategies

Updated On : October 26, 2023 / 12:12 PM IST

Telangana Congress New Strategies : ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఒకరొపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. రాస్ట్రంలో రాజకీయాలు వాడీ వేడీగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది.

కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ?
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పై గెలుపు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ చేస్తారనే సమాచారం. గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ కు పోటీగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బరిలోకి దింపేలా కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.  అదేవిధంగా కొండగల్ తోపాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది.

Also Read: పెద్దపల్లి నియోజవకర్గంలో ఆ రికార్డును సాధిస్తారా?

కేటీఆర్ పై ఉత్తమ్, హరీష్ రావుపై కోమటిరెడ్డి పోటీ?

మరోవైపు సిరిసిల్ల కేటీఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డిని బరిలోకి దించాలని కాంగ్రెస్ హైకమాండ్  ఆలోచిస్తోంది. ఇక హరీష్ రావును ఓడించేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బరిలోకి దింపేలా కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ వచ్చాక ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.