Yadadri Temple : యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. వాహనాలు కిందనే నిలిపేస్తున్న అధికారులు

వారాంతపు సెలవుదినం, అమావాస్య తరువాతి రోజు కావడంతో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.

Yadadri Temple : వారాంతపు సెలవుదినం, అమావాస్య తరువాతి రోజు కావడంతో వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి భక్తులు క్యూ కట్టారు. కుటుంబ సమేతంగా గుట్టకు తరలివచ్చారు భక్తులు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. ఇక దర్శనానికి ఏర్పాటు చేసిన క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని దేవాలయ అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది.

చదవండి : Yadadri Lakshmi Narasimha Swamy : చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు

ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొదలైంది. నారసింహుడికి నిజాభిషేకంతో పూజలు ప్రారంభించారు. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సాయంత్రం వేళ అలంకార జోడు సేవలు నిర్వహించనున్నారు. మండపంలో అష్టోత్తర పూజలు జరిపారు.

చదవండి : Yadadri : విమాన గోపురానికి మంత్రి మల్లారెడ్డి విరాళాల సేకరణ, 11 కిలోల బంగారం

 

ట్రెండింగ్ వార్తలు