ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య.. భర్తకు ఏమని మెసేజ్ పెట్టిందంటే.. వెంటనే స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త

ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన భార్య.. కొద్దిగంటల తరువాత భర్తకు మెస్సేజ్ చేసింది.

ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య.. భర్తకు ఏమని మెసేజ్ పెట్టిందంటే.. వెంటనే స్టేషన్ లో ఫిర్యాదు చేసిన భర్త

Missing Case

Updated On : March 19, 2025 / 9:52 AM IST

Wife Missing: తన భార్య కనిపించడం లేదని సూరారం పోలీస్ లకు భర్త ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన భార్య.. కొద్దిగంటల తరువాత భర్తకు మెస్సేజ్ చేసింది. దీంతో భర్తకు ఏం చేయాలో తెలియక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

 

సాయిబాబానగర్ పాండు బస్తీలో రమేష్, మీనాక్షి దంపతులు నివాసం ఉంటున్నారు. మీనాక్షి స్థానికంగా కూరగాయల దుకాణం నిర్వహించేది. ఈ నెల 16వ తేదీన సాయంత్రం ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. సాయంత్రం సమయంలో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన రమేష్ కు భార్య కనిపించలేదు. దీంతో ఆమె సెల్ కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. చుట్టుపక్కల వారిని ఆరాతీసినా జాడ దొరకలేదు. ఆమె తరుచుగా వెళ్లే ప్రాంతాలకు వెళ్లి ఆరా తీసినా ఫలితం కనిపించలేదు. అయితే, రాత్రి 11గంటల సమయంలో భార్యనే తన సెల్ ఫోన్ నుంచి భర్తకు మెసేజ్ చేసింది.

 

‘నేను ఇంటికి రాను. నన్ను మర్చిపో’ అంటూ భర్తకు మెసేజ్ పంపించింది. దీంతో కంగారుపడిన రమేష్ తన భార్య కనిపించడం లేదని సూరారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మీనాక్షి కావాలనే ఇంటి నుంచి వెళ్లిపోయిదా..? ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.