Huzurabad By Poll : హుజూరాబాద్ మండల ఓటర్లు ఎటువైపు ?

పోతిరెడ్డి పేటకు సంబంధించిన ఈవీఎంను తెరిచి అందులో ఉన్న ఓట్లను లెక్కించారు. కానీ...అందరి చూపు...హుజూరాబాద్ మండలం వైపు ఉంది.

Huzurabad Bypoll : హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. గెలుపు ఎవరనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగే అవకాశం ఉంది. అందరూ ఊహించినట్లే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

Read More : Shah Rukh Khan: విద్యుత్ దీపాలతో జిగేల్ మనిపిస్తున్న షారుఖ్ మన్నత్!

ఏడు టేబుళ్ల చొప్పున రెండు హాళ్లలో 14 టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరిగింది. 822 పోస్టల్ బ్యాలెట్లకు గాను 753 ఓట్లు పోలయ్యాయి. 160 ఓట్ల అధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ముందంజలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు 503 ఓట్లు రాగా..బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 159, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు వెంకట్ కు 32 ఓట్లు వచ్చాయి. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Read More : Huzurabad By Poll : పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, లీడ్‌‌లో టీఆర్ఎస్

అనంతరం ఈవీఎంలను తెరిచారు. పోతిరెడ్డి పేటకు సంబంధించిన ఈవీఎంను తెరిచి అందులో ఉన్న ఓట్లను లెక్కించారు. కానీ…అందరి చూపు…హుజూరాబాద్ మండలం వైపు ఉంది. ఇక్కడి ఓటర్లు ఏ అభ్యర్థి వైపు నిలిచారనేది ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ 52 వేల 827 ఓట్ల ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ నుంచి ఆరో రౌండ్ వరకు మండల ఓట్లు కౌంట్ చేస్తారు. బీజేపీ ఓటు బ్యాంకు సొంతం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. కానీ టీఆర్ఎస్ గట్టిపోటీనిస్తుందని తెలుస్తోంది. ఏడో రౌండ్ నుంచి 10వ రౌండ్ వరకు వీణవంక మండలం ఓట్లు, 11 నుంచి 15 రౌండ్ వరకు జమ్మికుంట మండలం ఓట్లను, 16 నుంచి 18వ రౌండ్ వరకు ఇల్లందకుంట ఓట్లను లెక్కిస్తారు. 19 నుంచి  22 రౌండ్​లో కమాలాపూర్ మండల ఓట్లను కౌంట్​ చేస్తారు. మొత్తంగా కౌంటింగ్ పై ఉత్కంఠ నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు