విషాదం.. భయంతో ఇంటర్ స్టూడెంట్ బలవన్మరణం
Hyderabad: దానికి సంబంధించిన 'ఆన్సర్ కీ' నాలుగు రోజుల క్రితం వెలువడింది. అయితే అందులో

ఎంతో ప్రేమగా కుమారుడిని 17 సంవత్సరాలపాటు పెంచిన తల్లిదండ్రులకు ఆ దేవుడు ఎంతో దుఃఖాన్ని మిగిల్చాడు. ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన తోన్నెటి వినయ్ (17) హైదరాబాద్ మాదాపూర్ లో ప్రముఖ కార్పొరేటర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
IIT-Jee మెయిన్ ఎంట్రన్స్ పరీక్ష జనవరి నెలలో రాశాడు. దానికి సంబంధించిన ‘ఆన్సర్ కీ’ నాలుగు రోజుల క్రితం వెలువడింది. అయితే అందులో మార్కులు లెక్కించుకోగా వినయ్ అనుకున్న మార్కులు రాకపోవడంతో.. భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ఇంకో విషయం ఏంటంటే తన చదువుకి ఆర్థికంగా సహాయపడుతున్నది బంధువులు అని తెలిసింది. పరీక్షల సీజన్ లో విద్యార్థుల బలవన్మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలంటూ నిపుణులు ఎంతగా సూచిస్తున్నా విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో, కాలేజీల తీరులో మార్పు రావడం లేదు.
Suryapet: ఇంటర్ విద్యార్థిని మృతికి ప్రిన్సిపాలే కారణమంటూ తల్లిదండ్రుల ఆందోళన.. ఏం జరిగింది?