Suryapet: ఇంటర్ విద్యార్థిని మృతికి ప్రిన్సిపాలే కారణమంటూ తల్లిదండ్రుల ఆందోళన.. ఏం జరిగింది?
ఆ విద్యార్థిని మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, మృతికి ప్రిన్సిపాల్ కారణమని..

సూర్యాపేట జిల్లాలోని ఇమాంపేట బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని తన గదిలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపుతోంది.
ఆ విద్యార్థిని కళాశాల యాజమాన్యం నిర్వహించిన ఫేర్వెల్ పార్టీలో చురుకుగానే పాల్గొంది. ఏమైందో ఏమో గాని పార్టీ మధ్యలోనే తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అనుమానం వచ్చిన స్నేహితులు కొద్దిసేపటి తర్వాత తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్ కి వేలాడుతూ కనపడింది. వెంటనే అప్రమత్తం అయి స్థానిక హాస్పిటల్ కి తీసుకొని వెళుతుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచిందని హాస్టల్ వార్డెన్ తెలిపారు.
ఇవాళ ఆ విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఆ విద్యార్థిని మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, మృతికి ప్రిన్సిపాల్ కారణమని, వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాల ముందు బైఠాయించి ఆందోళన చేశారు. మరరోవైపు, ఇటీవల భువనగిరి ఎస్సీ గురుకుల హాస్టల్‌లో ఇద్దరు టెన్త్ విద్యార్థులు అనుమానస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసందే.
న్యాయం చేయాలంటూ విద్యార్థిని బంధువుల ధర్నా
సూర్యాపేట – నిన్న ఆత్మహత్య చేసుకున్న వైష్ణవి తల్లిదండ్రులు, బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు.. అమ్మాయి మృతికి ప్రిన్సిపల్ కారణమని ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. https://t.co/zMnaFJOskS pic.twitter.com/PCmZE5dMRO
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2024