Madapur Durgam Cheruvu
Hyderabad – Durgam Cheruvu: హైదరాబాద్ లోని మాదాపూర్ (Madhapur) దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి 17 ఏళ్ల ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. స్నేహితురాలితో కలిసి కేబుల్ బ్రిడ్జిపై నడుస్తూ ఒక్కసారిగా పై నుండి దుర్గం చెరువులోకి దూకింది. ఆ బాలికను ఆమె స్నేహితురాలు ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు.
దీంతో ఆమె స్నేహితురాలు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించింది. యువతి కోసం దుర్గం చెరువు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలు కర్ణాటకకు చెందిన అమ్మాయని పోలీసులు గుర్తించారు.
ఉద్యోగం నిమిత్తం నాలుగు నెలల క్రితం ఆమె హైదరాబాద్ కు వచ్చింది. ఆమె ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Viral Video: లారీ కింద పడ్డా బతికి బయటపడ్డాడు.. మాములు అదృష్టం కాదిది..