two crores robary
Hyderabad : హైదరాబాద్ నగరంలో దారి దోపిడీలు వణుకు పుట్టిస్తున్నాయి. నగరంలోని వనస్థలిపురంలో బార్ ఓనర్ పై దాడి చేసిన రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు దోపిడీ దొంగలు. ఆటోనగర్ ఎంఆర్ఆర్ బార్ ఓనర్ పై దాడి చేసి రూ. కోట్లను దోచుకుపోయారు. ఈ దోపిడీలో జరిగిన పెనుగులాటలో బ్యాగ్ నుంచి రూ.25 లక్షలు కిందపడిపోయాయి. వాటిని వదిలేసి బ్యాగ్ లోని రూ.1.75 కోట్లను దోచుకుపోయారు.బాధితుడు వెంటనే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
వనస్థలిపురంలో వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి ఎంఆర్ఆర్ బార్ నిర్వహిస్తున్నారు. శనివారం (జనవరి 7,2023) రూ.2కోట్ల డబ్బును తీసుకుని వెళుతుండగా ఇది తెలిసిన కొంతమంది ఆయన్ని వెంబడించారు. దారి మధ్యలో అటకాయించి బ్యాగ్ లాక్కోవటానికి యత్నించారు. కానీ వెంకట్రామిరెడ్డి పెనుగులాడటంతో బ్యాగునుంచి రూ.25 లక్షల కట్టలు కిందపడిపోయారు. మిగత డబ్బు బ్యాగును లాక్కుని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. కింద పడిన డబ్బును తీసుకుని వనస్థలిపురం పోలీసు స్టేషన కు వెళ్లి ఫిర్యాదు చేశాడు వెంకట్రామిరెడ్డి.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దీంట్లో భాగంగా పోలీసులు దోపిడీ జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. కానీ వెంకట్రామిరెడ్డి మాత్రం పొంతనలేని సమాధాలు చెబుతున్నాడు. దీంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. నిజంగానే దోపిడీ జరిగిందా? లేక వెంకట్రామిరెడ్డి డ్రామాలాడుతున్నాడా? అని అనుమానిస్తున్నారు.