Hyderabad She Team : మహిళలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో 2014 అక్టోబర్ 24న తెలంగాణ ప్రభుత్వం ‘షీ టీమ్స్’ ప్రారంభించింది. దేశంలోనే మొదటగా తెలంగాణలో ఈ సేవలు మొదలయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై ఆకతాయిలు వేధింపులకు గురి చేసినా, ఈవ్ టీజింగ్‌కు పాల్పడినా వెంటనే టీమ్ సహాయపడుతుంది. ఆకతాయిలకు బుద్ధి చెబుతుంది.
South Central Railway: రైళ్లపై రాళ్లేస్తే జైలుకే.. మూడు నెలల్లో 39 మందికి జైలు శిక్ష
కొందరు ఆకతాయిలు బహిరంగ ప్రదేశాల్లో మహిళల్ని వేధిస్తుంటారు. రద్దీగా ఉండే మెట్రోలు, బస్ స్టాప్‌లు, కాలేజీలు, స్కూళ్లు, లేడీస్ హాస్టళ్లు, పార్కుల దగ్గర చేరి వెకిలి చేష్టలతో ఆడవారిని ఇబ్బంది పెడుతుంటారు. తాకరాని చోట్ల తాకుతూ వికృత చేష్టలకు పాల్పడుతుంటారు. అలాంటి వారి నుంచి రక్షించడానికి వారికి భద్రత కల్పిండానికి షీ టీమ్స్ పనిచేస్తోంది. 100 నంబర్‌కి డయల్ చేస్తే షీ టీమ్స్ అందుబాటులోకి వస్తారు.
ఫిర్యాదు అందుకున్న షీ టీమ్ సభ్యులు సివిల్ డ్రెస్‌లో ఘటనా స్థలానికి వెళ్తారు. నేరాన్ని రికార్డ్ చేయడానికి ఎవరు గుర్తించలేని విధంగా కెమెరాలను తమ వెంట తీసుకెళ్తారు. నేరానికి సంబంధించిన సరైన ఆధారాలతో పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తారు. నేరం రుజువైతే పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేస్తారు.
New Police Stations : హైదరాబాద్‌లో 40 కొత్త పోలీస్ స్టేషన్లు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారంటే..
హైదరాబాద్ సిటీ పోలీస్ మహిళల భద్రత కోసం, వారిని అప్రమత్తం చేయడం కోసం సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తూ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఆకతాయిల నుంచి వేధింపులు ఎదురైతే షీ టీమ్స్ నంబర్ 100 కు కాల్ చేయమంటూ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసింది. ‘మీరు చేసే పనులు చూస్తున్నారు.. కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించండి’ అనే శీర్షికతో ఈ వీడియోను షేర్ చేసారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హైదరాబాద్ పోలీసులపై, షీ టీమ్స్ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆడవారికి ఎక్కడైనా.. ఎప్పుడైనా.. విపత్కర పరిస్థితులు ఎదురైనపుడు తక్షణ సాయం కోసం షీ టీమ్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. 100 నంబర్ ను తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవడం మర్చిపోవద్దు.
Your activities are being watched, so behave…#SHETeams #HyderabadCityPolice pic.twitter.com/45shQZw3tY
— Hyderabad City Police (@hydcitypolice) September 22, 2023