Hyderabad: ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం.. కాలేజీ వద్ద ఉద్రిక్తత

Hyderabad: తమ కూతురి మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులకు..

Inter College

హైదరాబాద్ శివారులోని ఫీర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థిని వర్ష బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపుతోంది. నిన్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడంతో గత రాత్రి నుంచి కాలేజ్ వద్ద ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేస్తున్నారు.

తమ కూతురి మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు అంటున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. కాలేజీకి యాజమాన్యం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. గాంధీ ఆసుపత్రి మార్చురీలో నేడు విద్యార్థిని మృతదేహానికి పోస్ట్ మార్టం చేస్తారు.

చదువు విషయంలో వర్షపై కాలేజీ తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ర్యాంకుల కోసం విద్యార్థులను బలితీసుకుంటున్నారని మండిపడుతున్నారు. కాలేజీ వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో కాలేజ్ వద్దకు మంత్రి జూపల్లి కృష్ణారావు రానున్నారు.

Anakapalle: ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం