Anakapalle: ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం

రామకృష్ణతో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా, మరో కుమార్తె ప్రభుత్వ ఆసుపత్రిలో..

Anakapalle: ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం

Vizag Family

Updated On : December 29, 2023 / 10:56 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఓ స్వర్ణకారుడి కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. భార్య, ముగ్గురు కుమార్తెలతో స్వర్ణకారుడు శివ రామకృష్ణ సైనైడ్ తాగాడు.

దీంతో రామకృష్ణతో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా, మరో కుమార్తె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల పేర్లు రామకృష్ణ, దేవి, జాహ్నవి, ప్రియ అని పోలీసులు తెలిపారు.

రామకృష్ణ భార్య, పిల్లలతో కలిసి సెనైడ్ తాగడానికి ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ చిన్న కూమార్తె ప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శివ రామకృష్ణ కుటుంబం గుంటూరు జిల్లా తెనాలి నుంచి అనకాపల్లికి వచ్చి ఇక్కడే నివసిస్తోంది.

అనకాపల్లి డిఎస్పీ సుబ్బరాజు మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు. అప్పుల కారణంగానే ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. చిన్న కూతురు ప్రియకు వాంతులు అవుతూ పిలుస్తున్నప్పటికీ.. తల్లిదండ్రులు, అక్కలు ఎంత లేపినా లేవకపోవడంతో పక్కంటి వారికి సమాచారం ఇచ్చిందని అన్నారు.

స్థానికులు 108కు కాల్ చేశారని, అప్పటికే నలుగురు మృతి చెందారని వివరించారు. చిన్న పాప ప్రియ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. ఆర్ఎంవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. శివరామకృష్ణ చినకుమార్తె ప్రియ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

PUC certificate Verification : మీ కారు లేదా బైక్ పీయూసీ సర్టిఫికేట్‌కు ఇకపై వీడియో వెరిఫికేషన్ తప్పనిసరి.. ఎందుకంటే?