Hit and Run Case
Road Accident : హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి టెంపుల వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకర్ అక్కడికక్కడే మరణించాడు. అయితే, ఈ ప్రమాదంకు కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ హిట్ అంట్ రన్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
Also Read : VC Sajjanar : ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఘోర ప్రమాదానికి కారణమైంది.. వీడియోను షేర్ చేసిన సజ్జనార్
జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి గుడివద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాప్ట్ వేర్ ఇంజినీర్ రుత్విక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే రుత్విక్ రెడ్డికి అమెజాన్ లో ఉద్యోగం వచ్చింది. తాను పనిచేసే స్థలాన్ని చూపిస్తానంటూ ఫ్రెండ్స్ ను రుత్విక్ రెడ్డి తీసుకెళ్లాడు. ఫ్రెండ్స్ తో కలిసి బార్ లో రుత్విక్ రెడ్డి మద్యం సేవించాడు. బుధవారం తెల్లవారు జామున ఉదయం 4గంటల సమయంలో ఫ్రెండ్స్ ను తీసుకెళ్లి తాను పనిచేస్తున్న ఆఫీస్ చూపించాడు. ఆ తరువాత మదాపూర్ వెళ్లి రిత్విక్ బిర్యానీ తిన్నాడు. తిరిగి వస్తున్న సమయంలో పెద్దమ్మతల్లి గుడి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read : దొరికాడు.. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు అరెస్ట్
హిట్ అండ్ రన్ కేసు విషయంపై జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. A1గా కొవ్వూరి రిత్విక్ రెడ్డి, A2 వైష్ణవి, A3 పొలుసాని లోకేశ్వర్ రావు, A4 బుల్లా అబిలాష్, A5 అనికేత్ ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హిట్ రన్ కేసులో తారక్ రామ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడని, ఏసు రాజుకు తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఏ1 రిత్విక్ రెడ్డి పరారయ్యాడని, కారును బీహెచ్ఈఎల్ లో దాచిపెట్టారని ఏసీపీ తెలిపారు. నిందితుల కోసం గాలించి సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా అరెస్టు చేశామని తెలిపారు. రిత్విక్ రెడ్డి అమెజాన్ లో జాబ్ చేస్తున్నాడు. ఆఫీస్ చూపిస్తానని మిగిలిన ఫ్రెండ్స్ తీసుకెళ్లాడు. రిత్విక్ రెడ్డి మద్యంలో ఉండి కారు డ్రైవ్ చేశాడు. అలాగే మద్యం మత్తులో ఉన్నాడని తెలిసికూడా కారులో ప్రయాణించిన వారినికూడా నిందితులుగా చేర్చామని ఏసీపీ హరిప్రసాద్ తెలిపారు. ఈ హిట్ అండ్ రన్ కేసులో A1 రిత్విక్ రెడ్డి పై 304 (2) కింద కేసులు నమోదు చేశామని, దీంతో పాటు 337 ఐపీసీ , 337, 187 MV Act కింద కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
ఇదిలాఉంటే.. ఈ ప్రమాదంలో మరణించిన తారక్ రామ్.. జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ లో బౌన్సర్ గా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకొని బైక్ పై ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు వెనుకనుంచి వచ్చి తారక్ ను ఢీకొట్టింది. తారక్ కు ఏడాదిన్నర క్రితం వివాహం కాగా.. 11నెలల కుమారుడు ఉన్నాడు.