VC Sajjanar : ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఘోర ప్రమాదానికి కారణమైంది.. వీడియోను షేర్ చేసిన సజ్జనార్
తమిళినాడులో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియోను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.

Tamil Nadu road accident
Road Accident : తమిళనాడులో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని సేలం – బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ వంతెనపై వేగంగా దూసుకొచ్చింది. ముందున్న కార్లు, లారీలను ఢీకొట్టింది. ఈ క్రమంలో ముందున్న లారీవెళ్లి మరో లారీని ఢీకొట్టింది. ఆ లారీ అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి బోల్తా పడింది. అసలు ప్రమాదానికి కారణమైన బ్రిడ్జిపై ఉన్న లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీతో సహా కారు మంటల్లో దగ్దమైంది. ఈ ఘోర రోడ్డుప్రమాదంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : VC Sajjanar : నడిరోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతి డ్యాన్స్ .. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్
తమిళినాడులో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియోను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఈ ఘోర ప్రమాదానికి కారమైంది. నలుగురి ప్రాణాలను బలితీసుకుందంటూ పేర్కొన్నారు. రహదారిపై ప్రయాణించే సమయంలో నిర్లక్ష్యంగా వాహనాలు నడపొద్దని ప్రయాణికులకు సజ్జనార్ నిత్యం సూచిస్తూ వీడియోలు షేర్ చేస్తుంటారు. తాజాగా.. తమిళనాడులో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఈ ఘోర ప్రమాదానికి కారణమైంది. నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. తమిళనాడులోని సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిందీ ప్రమాదం.@MORTHIndia #RoadAccident pic.twitter.com/6nTNXRSyht
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 25, 2024