ఈ సారి మట్టితో 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి

దానం నాగేందర్ మాట్లాడుతూ.. కర్ర పూజ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఈ సారి మట్టితో 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి

Khairatabad Ganesh

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణపతి ఏర్పాటుకు కర్ర పూజ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. కర్ర పూజ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

ఈ సారి మట్టితో 70 అడుగుల మహాగణపతి ఏర్పాటు చేస్తామని తెలిపారు. 11 రోజుల పాటు గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ప్రసాద పంపిణి చేస్తామని చెప్పారు.

మహాగణపతి గణేశుడి నిర్మాణ పనులు షురూ చేస్తామని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. పోలీసు భద్రత పెంపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తామని అన్నారు. కాగా, ఏడాది సెప్టెంబరు 7న వినాయక చవితి జరగనుంది. మహాగణపతి దర్శించుకోవడానికి ప్రతి ఏడాది సుమారు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు వస్తారు.

ఉక్కుపాదం మోపుతాం.. 3 నెలల్లో మార్పులు తీసుకొస్తాం: హోం మంత్రి అనిత