Hyderabad : మణికొండలో వరదనీటిలో వ్యక్తి గల్లంతు
బంగారు ఆలయం రోడ్డు గుండా ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఓ చోట అడుగు పెట్టగా..అక్కడ గుంత ఉంది. దీంతో అందులో పడిపోయి..వరదనీటిలో కొట్టుకపోయాడు.

Hyd Rain
Manikonda : హైదరాబాద్ మహానగరం మరోసారి భారీ వర్షంతో తడిసిముద్దయ్యింది. 2021, సెప్టెంబర్ 25వ తేదీ రాత్రి అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ ముందే హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు రెండు గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై భారీగా నీరు నిలవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
Read More : MLA Malladi Vishnu : పవన్ కన్నెత్తి చూస్తే కాలిపోవడానికి ఎవరూ లేరు : మల్లాది విష్ణు
ఎక్కడ గుంత ఉందో..ఎక్కడ రోడ్డు ఉందో తెలియక ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జాం అయ్యింద. ఈ ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. ఇదిలా ఉంటే..మణికొండలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. బంగారు ఆలయం రోడ్డు గుండా ఇతను నడుచుకుంటూ వెళుతున్నాడు. ఓ చోట అడుగు పెట్టగా..అక్కడ గుంత ఉంది. దీంతో అందులో పడిపోయి..వరదనీటిలో కొట్టుకపోయాడు.
Read More : Refrigerator Is On Sale : ఫ్రిజ్ అమ్మకానికి కలదు..కానీ ఎక్కడుందో చెప్పగలరా ?
డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు కోసం అక్కడ పెద్ద ఎత్తున గుంతలు తవ్వారు. భారీ వర్షం పడడంతో నీటితో ఆ గుంతలన్నీ నీటిలో మునిగిపోయాయి. ఆ సమయంలో అటుగా వచ్చిన ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయి వరద ప్రవాహానికి కొట్టకపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. వ్యక్తి కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.