Hyderabad Metro: న్యూ ఇయర్‌ వేళ ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్.. మద్యం తాగి వస్తే మాత్రం..

మెట్రో స్టేషన్లలోకి ఎవరైనా మద్యం తాగి వచ్చినా, తోటి ప్రయాణికులు, సిబ్బందితో...

Hyderabad Metro: న్యూ ఇయర్‌ వేళ ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్.. మద్యం తాగి వస్తే మాత్రం..

Hyderabad metro train

నూతన సంవత్సర వేడుకల వేళ రేపు అర్ధరాత్రి మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రేపు చివరి మెట్రో రైలు అర్ధరాత్రి దాటాక 12.15 గంటలకు తొలి స్టేషన్ నుంచి బయలుదేరి ఒంటి గంటకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుందని వివరించారు.

తాగి తందనాలాడారో..

మెట్రో రైళ్లతో పాటు అన్ని మెట్రో స్టేషన్లలో పోలీసులతోనూ నిఘా ఉంటుందని తెలిపారు. మెట్రో స్టేషన్లలోకి ఎవరైనా మద్యం తాగి వచ్చినా, తోటి ప్రయాణికులు, సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మెట్రో రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు.

కాగా, జనవరి 1వ తేదీన హైదరాబాద్ మెట్రో రైలు సూపర్ సేవర్ మెట్రో హాలీ డే కార్డు పనిచేస్తుంది. కేవలం రూ.59కే రీఛార్జ్ చేయించుకుని రోజంతా హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్ని ట్రిప్పులైనా తిరగొచ్చు. న్యూ ఇయర్ వేళ స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లోని దర్శనీయ ప్రదేశాలకు వెళ్తుంటారు చాలామంది. ప్రతి ఆదివారం రోజున కూడా మెట్రో రైలు సూపర్ సేవర్ మెట్రో హాలీ డే కార్డు పనిచేస్తుంది. దీంతో, రేపు, ఎల్లుండి మెట్రోలో తక్కువ ధరకే ప్రయాణిస్తూ ఎంజాయ్ చేయొచ్చు.

Also Read: మహిళకు ఇచ్చిన శాండ్‌విచ్‌లో పురుగు.. క్షమాపణలు చెప్పిన ఇండిగో ఎయిర్ లైన్స్