Hyderabad Police: న్యూఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం రెడీ అవుతోంది. కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. నూతన సంవత్సర వేడుకలకు ఓ రేంజ్ లో ప్రిపరేషన్స్ చేస్తున్నాయి హోటల్స్, పబ్స్. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల కఠిన నిఘా పెట్టారు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో జీరో డ్రగ్స్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. న్యూఇయర్ వేళ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపనున్నారు. పబ్‌లు, హోటళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని పబ్ లు, హోటల్స్ కు సీపీ సజ్జనార్ హెచ్చరించారు. డ్రగ్స్‌కు జీరో టాలరెన్స్ అని తేల్చి చెప్పారు. రాత్రి 1 గంటకే పబ్‌లు, హోటళ్లు మూసివేయాలన్నారు. న్యూ ఇయర్ వేళ నగరమంతా నిఘా పెడతామన్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read: ఏపీ సీఐడీ ఘనత.. ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ నెట్ వర్క్ గుట్టు రట్టు.. దేశవ్యాప్తంగా 10వేల కోట్ల మోసం..