Hyderabad Rain Alert : హైదరాబాద్‌ను వణికిస్తున్న వాన.. జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచన

హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. పండగ కదా అని షాపింగ్ కు వెళ్లాలని అనుకుంటున్నారా? లేదా పని మీద ఇంటి నుంచి బయటకు వచ్చారా? అయితే వెంటనే తిరిగి వెనక్కి వెళ్లిపోండి ఇంటికి.

Hyderabad Rain Alert : హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. పండగ కదా అని షాపింగ్ కు వెళ్లాలని అనుకుంటున్నారా? లేదా పని మీద ఇంటి నుంచి బయటకు వచ్చారా? అయితే వెంటనే తిరిగి వెనక్కి వెళ్లిపోండి ఇంటికి. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మరో రెండు గంటల పాటు నగరంలో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అటు గంట నుంచి నగరంలో భారీ వర్షం పడుతూనే ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. నాంపల్లి, గోషామహల్, కోఠి, నారాయణగూడ, అఫ్జల్ గంజ్, మల్లేపల్లి, చిక్కడపల్లి, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది.

ఇక అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోనూ రోడ్లపై నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర బృందాలను జీహెచ్ఎంసీ రెడీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని అలర్ట్ చేసింది జీహెచ్ఎంసీ. నగరంలో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. మరో రెండు గంటల పాటు కుండపోత వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరిక చేసిన నేపథ్యంలో హైదరాబాద్ వాసులు అలర్ట్ గా ఉండాలని జీహెచ్ఎంసీ సూచన చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు