హైదరాబాద్ నగరంలో మంగళవారం నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ ఎక్కడెక్కడ ఉంటుందో తెలుపుతూ హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి రూట్ మ్యాప్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
వాహనదారులు ఇబ్బందులు తలెత్తకుండా సూచించిన రూట్లలో వెళ్లాలని తెలిపారు. హనుమాన్ విజయయాత్ర వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమై.. సికింద్రాబాద్లోని తాడ్బండ్ హనుమాన్ మందిర్కి వెళ్తుంది.
రేపు ఉదయం 11.30 రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ డైవెర్షన్స్ ఫాలో కావాలి. కూడళ్లలో 44 చోట్ల డైవెర్షన్ పాయింట్స్ ఉంటాయి. హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి.
ట్రాఫిక్ డైవర్షన్స్ ఎక్కడెక్కడ?
Also Read : ఘోరాతి ఘోరం.. వాటర్ సంపులో పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి.. వీడియో వైరల్