HYD N umaish : హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ నుమాయిష్ సంద‌డి మొదలుకానుందా..?

హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ నుమాయిష్ సంద‌డి మొదలుకానున్నట్లుగా తెలుస్తోంది. గత ఏడాది కరోనా వల్ల నిలిచిపోయిన నుమాయిష్ ఈ ఏడాది ప్రారంభం కానుందని సమాచారం.

Hyedrebad Nampalli Numaish 2021

Nampalli numaish : కరోనా తగ్గుముఖం పట్టటంతో భాగ్యనగరంలో మరోసారి నుమాయిష్ సందడి చేయనుంది. హైదరాబాద్ నగరంలోని నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో ప్ర‌తి సంవత్సరం శీతాకాలంలో జనవరి నెలలో నుమాయిష్ నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే. కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త సంవత్సరం నుమాయిష్‌ను నిలిపివేశారు. కానీ సంవత్సరంలో క‌రోనా కేసులు భారీగా త‌గ్గిపోతున్నాయి. దీంతో మరోసారి నగరంలో నుమాయిష్ సందడి చేయనుంది.

Read more : Crypto currency Sharia : క్రిప్టో కరెన్సీ షరియాకి విరుద్ధం అన్న ముస్లిం మత పెద్దలు..కరెన్సీపై నిషేధం విధించిన దేశం

నుమాయిష్‌ను నిర్వ‌హించేందుకు ఎగ్జిబిష‌న్ సొసైటీ ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో 2022 జ‌న‌వ‌రిలో నుమాయిష్ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసింది. ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఎగ్జిబిష‌న్ సొసైటీ కార్య‌ద‌ర్శి బీ ప్ర‌భాశంక‌ర్ పేర్కొన్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం జీహెచ్ఎంసీ, పోలీసు, ఫైర్ స‌ర్వీసెస్, విద్యుత్, రోడ్ల భ‌వ‌నాల శాఖ‌ల నుంచి కూడా అనుమ‌తి తప్పనిసరి. ప్ర‌తి ఏడాది దాదాపు 2,500 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

కానీ గత ఏడాది కరోనా ప్రభావం స్టాల్స్ సంఖ్యపై పడనున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది త‌క్కువ సంఖ్య‌లో స్టాళ్ల‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉన్నట్లుగా సమాచారం. కాగా నుమాయిష్ ద్వారా ప్ర‌భుత్వానికి చక్కటి ఆదాయం కూడా సమకూరుతుంది. అలా ఈ ఎగ్జిబిషన్ వల్ల దాదాపు రూ. 15 కోట్ల ఆదాయం స‌మ‌కూరే అవ‌కాశం ఉంది. ప్ర‌తి ఏడాది నుమాయిష్‌ను జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు నిర్వ‌హిస్తారనే విషయం తెలిసిందే.

Read more : shakira pizza order : ష‌కీరా గొంతుతో పిజ్జా ఆర్డ‌ర్..‘ఆ పిజ్జా నేను తీసుకోవచ్చా’..అని అడిగిన పాప్ సింగర్